మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యలయాన్ని ప్రారంభించిన..మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి..
స్వాగతం పలికిన బీజేవైఎం జిల్లా కార్యదర్శి
నూనె హజరత్ యాదవ్;
నెల్లూరు, ఆత్మకూరు, మర్రిపాడు, జూన్ 13, (సీమకిరణం న్యూస్):
కుటుంబ రాజకీయాలకు ,స్వార్ధ స్వావలంబన కు స్వస్తిపలకాలని తమ సత్తా చాటాలని ఆత్మకూరు ఉపఎన్నికల్లో తగ్గేదే లేదంటూ పోటీకి దిగిన బిజెపిపార్టీ ఆత్మకురు నియోజక వర్గానికి బిజెపి జిల్లా అధ్యక్షుడయిన భరత్ కుమార్ యాదవ్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి నిలిపింది ఈ క్రమంలో ఎన్నికల వ్యవహారాలు చూసుకోవడానికి మర్రిపాడు కేంద్రంలో బీజేపీ తాత్కాలిక కార్యాలయాన్ని బీజేవైఎం జిల్లా కార్యదర్శి నూనె హజరత్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకొని సోమవారం మాజీమంత్రి,బిజెపిరాష్ట్రఉపాధ్యక్షులు ,ఆదినారాయణ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆదినారాయణ రెడ్డి మాజీమంత్రి,బిజెపి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు , చిరంజీవి రెడ్డి రాష్ట్ర
కార్యదర్శి ,వాకాటినారాయణరెడ్డి ఎమ్మెల్సీ ,సన్నపురెడ్డి సురేష్ రెడ్డి కిషన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు, నూనె హజరత్ యాదవ్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి ,పనతల సురేష్ బీజేవైఎం మాజీ జాతీయ కార్యదర్శి పలువురు మండల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్బంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక సీట్లిచ్చామంటూ బస్సు యాత్ర చేసిన వైసీపీ.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీసీలకు సీటెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు రాజకీయాలను కుటుంబ వ్యవహారాలుగా చేస్తున్నారని వైసీపీ పై విమర్శలు గుప్పించారు ఆత్మకూరులో బీజేపీ బీసీ అభ్యర్థిని నిలబెట్టిందని, ఆయనకు నియోజకవర్గ ప్రజలు ముఖ్యంగా మర్రిపాడు మండల ప్రజల మద్దతివ్వాలని బిజెపి నాయకులు కోరారు.