అమీలియో ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స

అమీలియో ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
89 ఏళ్ల వృద్ధుడి మూత్ర సంచిలో 95 రాళ్లు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు
కోత పరీక్ష ద్వారా శస్ర్తచికిత్స నిర్వహించి 95 రాళ్లను తొలగించిన అమీలియో ఆస్పత్రి వైద్యులు
కర్నూలు వైద్యం, జూన్ 14, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు అమీలియో ఆస్పత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. 89 ఏళ్ల వృద్ధుడి మూత్ర సంచిలో 95 రాళ్లు ఉన్నట్లు గుర్తించి తొలగించారు వైద్యులు. పూర్తి వివరాలలోకి వెళితే….తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం లింగనహాయి గ్రామానికి చెందిన శేషిరెడ్డి(89) మూత్రంలో విపరీతమైన మంట, మూత్రం రాకపోవడం వలన గత నెల 16న అమీలియో ఆస్పత్రిని సంప్రదించారు. మూత్రశయ పరీక్షలు నిర్వహించిన మూత్రశయ వ్యాధి నిపుణులు డా. ఆర్. సతీష్ కుమార్ మూత్రసంచిలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు.
కోత పరీక్ష ద్వారా శస్ర్తచికిత్స నిర్వహించి..95 రాళ్లు, పొడి తొలగించినట్లు డా.ఆర్. సతీష్ కుమార్ తెలిపారు. ఇలాంటి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన డా. ఆర్. సతీష్ కుమార్ను, వైద్య బృందాన్ని అమీలియో ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డా. లక్ష్మీ ప్రసాద్ అభినందించారు. ఈ సందర్భంగా అమీలియో ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డా. లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ అమీలియో ఆస్పత్రిలో కిడ్నీకి సంబంధించిన డయాలసిస్, డిజెస్టంట్ మరియు వైద్యసేవలు, శస్త్రచికిత్సలు ఆరోగ్యశ్రీ లో చేస్తున్నామని జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.