పట్టాదారు పాస్ పుస్తకం కలిగిన ప్రతి రైతన్నకు పంటనష్ట పరిహారం చెల్లించాలి
బొందిమడుగుల మహాబూబ్ భాష
కర్నూలు టౌన్, జూన్ 15, (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా వ్యాప్తంగా 2021 సంవత్సరానికి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇంకా చాలా మంది రైతులకు రాకపోవడం పట్ల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా సోషియల్ మీడియా కో-ఆర్డినేటర్ బొందిమడుగుల మహాబూబ్ భాష బుధవారం ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు.చాలా మంది రైతులు పంట నమోదు చేయలేదని కారణంతో వారికి ఇన్పుట్ సబ్సిడీ అందించక పోవడం చాలా బాధాకరమైన విషయం అని ఆయన మండిపడ్డారు.పట్టదార్ పాసు పుస్తకం కలిగిన రైతులందరికీ పంట నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రతి రైతుకు పరిహారం చెల్లించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన తెలిపారు.రైతుల విషయంలో రాజకీయం తగదని ముందు పరిహారం చెల్లించి మాట్లాడాలని ఆయన అన్నారు.అలాగే మోటర్లకు మీటర్లు బిగించే విధానాన్ని రద్దుచేసి రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని సూచించారు.