దర్గాలో ప్రార్థనలు చేసిన మంత్రులు
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, జూన్ 15, (సీమకిరణం న్యూస్):
మండల కేంద్రమైన ఏఎస్ పేట లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ వారి దర్గాలో బుధవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తంబళ్లపల్లి కర్నూలు ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హఫీస్ ఖాన్ లు దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా పూజారి మంత్రులు ఎమ్మెల్యేలను సాదరంగా ఆహ్వానించారు దర్గా లోపల ఉన్న ఖాజా నాయబ్ రసూల్ దొరసానమ్మ సమాధులపై గలేఫ్ వస్త్రాలను వేసి పూల దుప్పట్లు ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే సమాధులపై ఉన్న గలేప్ వస్త్రాలను మంత్రులకు అందజేసి చేతికి కంకణాలు కట్టారు పూజారి ప్రత్యేక సలాములు గావించారు. అలాగే రాష్ట్ర వర్క్స్ బోర్డు చైర్మన్ ఖాదర్ భాష మైనార్టీ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైయస్సార్సీపి కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి ఎం పి పి పద్మజా రెడ్డి ఏఎస్ పేట సర్పంచ్ భర్త షేక్ జిలాని భాష, మండల కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ భాష, మాజీ ఎంపీటీసీ షబ్బీర్ భాష, నాయకులు రమేష్ రెడ్డి, పులిమి సుధాకర్ రెడ్డి , అనుమసముద్రం గ్రామ ఉప సర్పంచ్ షేక్ షేరాజ్, షేక్ రహమత్ నవాజ్, సయ్యద్ అబ్దుల్ రషీద్, ఉపసర్పంచ్ ,మండల యూత్ ప్రెసిడెంట్ షేక్ షౌకత్ అలీ, సయ్యద్ షౌకత్ అలీ, సయ్యద్ షకీల్, తదితరులు పాల్గొన్నారు