జగన్ పాలనలో జనం బేజారు – ఇంచార్జ్ తిక్కారెడ్డి
కౌతాళం , జూన్ 16, (సీమకిరణం న్యూస్):
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో జనం బేజారు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ మంత్రాల యం ఇన్చార్జ్ తిక్కారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ఎరిగేరి, కామవరం, ఉరుకుంద ,ఓబులాపురం, సులే కేరి, మదిరే, పొదలకుంట, కాత్రి కి గ్రామాలలో“బాదుడే బాదుడు ” కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం సందర్భంగా తిక్కా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం పేరుతో పేద ప్రజలకు బాదుడు ప్రారంభించిందన్నారు. విద్యుత్ చార్జీల బాదుడు, బస్సు చార్జీల బాదుడు, పెట్రో చార్జీల బాదుడు, గ్యాస్ ఛార్జి పెంపు వంటి బాదుడుతో జనం బేజారు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలలో రైతుల ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో కోతలు పెట్టడం, విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించడం వంటి చర్యలతో రైతుల నడ్డి విరుస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఉల్లిగయ్య, చెన్న బసప్ప, యువ నాయకులు సురేష్, టిప్పుసుల్తాన్, కొటేష్ గౌడ్, తిక్కయ్య, ఏద్దులయ్య తదితరులు పాల్గొన్నారు.