ఓటర్ల జాబితాలో సవరణలు చేపట్టండి
– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా
నంద్యాల కలెక్టరేట్, జూన్ 16, (సీమకిరణం న్యూస్) :
ఓటర్ల జాబితాలో తప్పొప్పుల సవరణకు స్వీకరించిన విజ్ఞ ప్తులు, ఆక్షేపణలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. గురు వారం విజయవాడ ఎన్నికల కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఓటర్ల జాబితా, ఎన్నికల ఫిర్యాదులు తదితర అజెండా అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిం చారు. జిల్లా కలెక్టర్ డా. మన జీర్ జిలాని సామూన్, డిఆర్ఓ పుల్లయ్య, డోన్,ఆత్మకూరు ఆర్డీఓలు వెంకటరెడ్డి, ఎం.కె. దాసు, మండల తహసీల్దార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో సవరణకు 33,088 దరఖాస్తులు వచ్చా యని రాబోయే 10 రోజుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి నమో దు చేస్తామని వివరించారు. జిల్లాలో 1604 మంది బూత్ స్థాయి అధికారులు, డీఈఓ, ఈఆర్ఓ, ఎఈఆర్ఓల నియ మించి సంబంధిత ప్రతిపాద నలు ఎన్నికల కార్యాలయానికి సమర్పించామన్నారు. చురుకు గా పనిచేస్తున్న బూత్ స్థాయి అధికారులను గుర్తించి నివేదిక సమర్పిస్తామన్నారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి రాజ కీయ పార్టీల నుండి ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించలే దన్నారు. ఉత్తమ ప్రతిభ ఉన్న బూత్ లను గుర్తించి విజయ గాధలు తయారు చేస్తామని కలెక్టర్ తెలిపారు.