
వడ్ల వ్యాపారి మోసానికి దగాపడ్డ ఓ దళిత రైతు
– న్యాయం కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ఏసు.
శిరివెళ్ల , జూన్ 16, (సీమకిరణం న్యూస్):
మండల కేంద్రములోని శిరివెళ్ల మజార గ్రామం అయినటు వంటి వెంకటేశ్వరపురం గ్రామా నికి చెందిన దళిత అవుకు ఏసు అనే కౌలు రైతును నమ్మించి చేసిన మోసానికి దఘా పడి నట్లు బాధిత కుటుంబ సభ్యు లు విలపించారు. 18 ఎకరాల కౌలు భూమిలోనీ 399 బస్తాల వరి ధాన్యంను గిట్టుబాటు ధర వచ్చినప్పుడు విక్రయం చేసు కుందని వెంకటేశ్వర రెడ్డి అను వడ్లవ్యాపారి నమ్మించి ఒక ప్రైవేటు గోదాముల్లో నిల్వ ఉం చి తనకు తెలియకుండానే ధా న్యం అమ్మి సొమ్ము చేసుకొని మోసానికి పాల్పడినట్లు అవుకు ఏసు, ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శిరివెళ్ల తహసీ ల్దార్ కార్యాలయం ఎదురుగా దళిత కౌలు రైతు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా అవుకు ఏసేపు మాట్లాడుతూ స్థానిక పోలీస్ స్టేషన్లో వడ్ల వ్యాపారి కి ఉన్న పలుకుబడి కారణంగా తనకు న్యాయం జరగలేదని ఆరోపించారు. తనను తన కూతురును బెదిరించి అక్షరాలు నింపని ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంత కాలు చేయించుకొని తీవ్ర అన్యాయానికి ఒడిగట్టినట్లు తెలిపారు. తనకు జరిగిన మోసాన్ని అన్యాయాన్ని దౌర్జన్యాన్ని వివరిస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ప్పటికీ న్యాయం జరగలేదని తెలిపారు. వడ్ల వ్యాపారి రాయ వెంకటరెడ్డి అనుచరులు మరియు కిరాయి మూకల నుండి తనకు తన కుటుంబా నికి ప్రాణ హాని ఉందని అధికా రులు చట్టపరమైన చర్యలు తీసుకోని న్యాయం చేయాలని కౌలురైతు సూచించారు.