
ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న వైసిపి ప్రభుత్వం
మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ
చాగలమర్రి, జూన్ 16, (సీమకిరణం న్యూస్) :
వైసిపి ప్రభుత్వం నిత్యవసరాల ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నదని మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం రాత్రి మండలంలోని ముత్యాలపాడు గ్రామంలో బాధుడే బాధుడు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ వైపల్యం పై ప్రజలకు మాజీ మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు గ్రామంలో కొళాయిలకు నీరు రావడం లేదని ఎవరికి పిర్యాదు చేసిన పట్టించుకొనే నాధుడే లేరని ఎస్సీ కాలనీ వాసులు వాపోయారు. ఈ సందర్భంగా అఖిల మాట్లా డుతూ ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజలను మోసం చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని మాజీ మంత్రి అఖిల ప్రియ ప్రజలకు పిలుపు నిచ్చా రు. ఈ ప్రభుత్వ పాలనలో అభి వృద్ది కార్యక్రమాలను విస్మరించి దని ప్రజా సమస్యలను పట్టిం చు కొనే వారే లేరన్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి సీఎం జగన్ను గద్దెదించాలని అభ్యర్థించారు . అమ్మఒడి కింద నిధులు ఇచ్చి ఆ డబ్బు ను తిరిగి కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని . ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల భవి తవ్యం బాగుండాలంటే టీడీపీని తిరిగి అధికారంలోకి తేవాలని కోరారు.సిఎం జగన్ రైతుల భవిష్యత్ నాశనం చేశార న్నారు.ఇసుక , మట్టి మాఫి యా , అక్రమ కేసులు వైసీపీ పాలనలో పెరిగిపోయాయని అన్నారు . గత టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన పథకాలను వైసీపీ పాలకులు కాపీ కొట్టి అమలులో విఫలమయ్యారని అఖిలప్రియ ఎద్దేవా చేశారు.కార్యక్రమం లో నియోజకవర్గ టిడిపి నాయకులు భార్గవ్ రామ్, మండల కన్వీనర్ లాయర్ నరసింహారెడ్డి,టిడిపి నాయకులు ఇండ్ల లక్ష్మిరెడ్డి,రమణారెడ్డి,జేసీబీ ప్రతాప్‌రెడ్డి,నరేష్,ఈశ్వర్ రెడ్డి,సంజీవరెడ్డి,నర్సిరెడ్డి,రవి,కొలిమి సోను,జెట్టి సుధాకర్,బషీర్ తదితరులు పాల్గొన్నారు.