
సినిమా థియేటర్ల యజమాన్యాలు యంఓయులు సమర్పించాలి
– సినిమా టికెట్లను ఆన్లైన్లోనే విక్రయించాలి
– జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
నంద్యాల కలెక్టరేట్, జూన్ 16, (సీమకిరణం న్యూస్):
జిల్లాలోని సినిమా థియేటర్ల యాజమాన్యాలు యంఓయు అవగాహన తాఖీదులను రు.100 ల బాండ్ పేపర్ మీద పొందుపరచి వెంటనే సమర్పిం చాలని జాయింట్ కలెక్టర్ మౌర్య సూచించారు. గురు వారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని సినిమా థియేటర్ల యాజమాన్యా లతో యంఓయులు, ఆన్లైన్లో టికెట్ల విక్రయంపై జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీఓలు శ్రీనివాసులు, వెంకటరెడ్డి, ఎం కె.దాసు, 14 మండలాల తాసీల్ధార్లు, సినిమా థియేటర్లు యాజమాన్య ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలోని సినిమా థియేటర్ల యంఓ యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిలిం టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారికి సమర్పించాలని సూచించిందని ఈ మేరకు సినిమా థియేటర్ల యాజమాన్యాలు వెంటనే తమ సినిమా థియేటర్ల యంఓయులు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులు నెం. 69 తేదీ ౦2-౦6-22 ప్రకారం సినిమా టికెట్లను ఆన్లైన్లో విక్రయించేం దుకు చర్యలు తీసుకోవాలని అన్ని సినిమా థియేటర్ల యాజమాన్యాలను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. టికెట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేసు కునేవారు సినిమా ప్రదర్శనకు నాలుగు గంటల ముందు సమాచారమిస్తే టికెట్ ధరలలో జిఎస్టి, సర్వీస్ ఛార్జీలను మిన హాయించి మిగిలిన టికెట్ సొమ్మును వినియోగదారునికి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అన్ని సినిమా థియేటర్ల యాజమా న్యాలు క్రమం తప్పక పాటించాలని ఆమె సూచించారు.