కర్నూలు జిల్లా ఇన్ఛార్జి డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సుధాకర్ బాబు
-: శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నంద్యాల పార్లమెంటు జిల్లా డిసిసి అధ్యక్షులు లక్ష్మీ నరసింహ
కర్నూలు టౌన్, జూన్ 16, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా ఇన్ఛార్జి డీసీసీ అధ్యక్షులుగా సుధాకర్ బాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డీసీసీ అధ్యక్షులు లక్ష్మి నరసింహ నూతన కర్నూలు జిల్లా ఇన్ఛార్జి డీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపడుతున్న మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మె ల్సీ సుధాకర్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవడానికి అందరిని కలుపుకొని ఐక్యమత్యంతో కాంగ్రెసు పార్టీని అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాననీ తెలిపారు. నంద్యాల పార్లమెంటు కర్నూల్ పార్లమెంటు జిల్లా అధ్యక్షులుగా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడం కోసం కలిసి కృషి చేస్తామని లక్ష్మీ నరసింహ తెలిపారు.