దేశ వ్యాప్తంగా మోడీ పై పెరుగుతున్న వ్యతిరేకత
– అగ్ని పథ్ పై జగన్ వైఖరి స్పష్టం చేయాలి
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య
రాజమహేంద్రవరం , జూన్ 19, (సీమకిరణం న్యూస్) :
దేశంలో రైతులు నిరుద్యోగులు ప్రజలను వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకత దేశవ్యాప్తంగా పెరుగు గుతుందని, ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడ కపోతే మూల్యం చెల్లించక తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య అన్నారు. ఆదివారం ఉదయం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వ రంగాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలని నిర్వీర్యం చేస్తున్నారని , ఎన్నికలకు ముందు ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు కల్పించకుండా
యువతను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం విధానాలపై దేశవ్యాప్తంగా యువత విసిగి పోయి ఆగ్రహంతో ఉన్నారని, అందుకే నిరసనలు భారీగా వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. భారతదేశానికి కీలకమైన రక్షణ రంగాన్ని కూడా ప్రైవేటు పరం చేసేందుకు తాజాగా పేరుతో సైన్యంలో నియామకాలకు సంబంధించిన ప్రకటన అగ్ని పథ్ విడుదల నేపథ్యంలో బీజేపీ అధికారంలో ఉన్న
బీహార్ , తెలంగాణ తో సహా పలు రాష్ట్రాలలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయని , అగ్ని పథ్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనుకూల వైఖరి అవలంబిస్తున్నారా లేక వ్యతిరేకంగా ఉన్నారా అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ మినహా 17 పార్టీలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో సమావేశమై బిజెపి అభ్యర్థి వ్యతిరేకంగా అభ్యర్థి నిలపాలని నిర్ణయించడం జరిగిందని , ఆ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానించడం జరిగిందని అన్నారు. జగన్ బిజెపి అభ్యర్థికి ఓటు వేస్తారా లేక … ప్రతిపక్షాల అభ్యర్ధికి ఓటు వేస్తారా అనే విషయాన్ని కూడా తేల్చాలని అన్నారు.
కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే కు సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కోనసీమలో పర్యటించి ఆయా గ్రామాల ప్రజలు రైతులతో మాట్లాడి రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపాలని కోరారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తున్న …గళం విప్పుతున్న ప్రతిపక్ష నేతలపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని … లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నివాసాన్ని కూల్చివేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే ఇటువంటి చర్యలను సిపిఐ ఖండిస్తుందన్నారు.
అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో అంబేద్కర్ కోనసీమ జిల్లా తక్షణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు జట్ల లేబర్ యూనియన్ ప్రెసిడెంట్ కూండ్రపు రాంబాబు, రేకా భాస్కర్ రావు, సిపిఐ నగర కార్యదర్శి నల్లా రామారావు, నగర సహాయ కార్యదర్శి వం గమూడి కొండలరావు , నగర కార్యవర్గ సభ్యులు బొమ్మసాని రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
…..