ఆధునిక జీవనంలో యోగ సాధన అవసరం
– జిల్లా క్రీడాశాఖ సీఈవో పి.వి రమణ.
కర్నూలు స్పోర్ట్స్ , జూన్ 19, (సీమకిరణం న్యూస్) :
ప్రతి ఒక్కరు తమ ఆధునిక జీవితంలో యోగ సాధన అంతర్భాగం చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చు అని జిల్లా క్రీడాశాఖ సీఈవో పి.వి రమణ అన్నారు. ఆదివారం జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కర్నూల్ నంద్యాల జిల్లాల యోగ పోటీలను ఆయన జిల్లా ఒలింపిక్ కమిటీ సభ్యులు పి.విజయ్ కుమార్,రాష్ట్ర యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవినాష్ శెట్టి,రాష్ట్ర స్కేటింగ్ సంఘం కార్యవర్గ సభ్యులు సునీల్ కుమార్,జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రెటరీ వేణుగోపాల్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఈవో రమణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల యోగా క్రీడను స్పోర్ట్స్ కోటా ద్వారా గ్రూప్ “సి” పోస్టులను భర్తీ చేసేందుకు ఆదేశాలు ఇవ్వడం శుభపరిణామం అన్నారు.అనంతరం రాష్ట్ర కార్యదర్శి అవినాష్ శెట్టి మాట్లాడుతూ భారత యోగా సంఘం ఆదేశాల మేరకు నేటి నుంచి మూడు రోజులపాటు 26 జిల్లాలో మూడు రోజుల పాటు యోగా ఉత్సవాల పేరుతో కార్యక్రమాలను కొనసాగిస్తున్నామన్నారు. పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 170 మంది క్రీడాకారులకు పైగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా యోగ సంఘం ప్రతినిధులు నగరాజ,విజయ్ కుమార్, ముని స్వామి, కళ్యాణి, రాజి,ప్రసన్న, కేశవ,లాలన ప్రియ, గంగాధర్,హరి ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.