అవినీతి, అరాచక, మాఫియా రాజ్యమేలుతుంది
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు
అవినీతి, అరాచక, మాఫియా రాజ్యమేలుతుంది
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు… సోము వీర్రాజు
నెల్లూరు,ఆత్మకూరు, మర్రిపాడు, జూన్ 18, (సీమకిరణం న్యూస్) :
ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్ కు మద్దతుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మర్రిపాడు మండలం పొంగూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వై ఎస్ ఆర్ సి పి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యం గిట్టుబాటు ధర కల్పించకపోవడం అలాగే కొనుగోలు చేసిన ధాన్యానికి రెండు మూడు నెలలు డబ్బులు చెల్లించకపోవడం మిల్లర్లతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురి చేస్తుండడంతో భారతీయ జనతాపార్టీ ప్రధాని నరేంద్ర మోడీ రైతుల క్షేమం కోసం రైతులు గిట్టుబాటు ధర కల్పించాలనే ఆలోచనతో 14 రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని. వేపపూత యూరియా సబ్సిడీ విత్తనాలు పీఎం కిసాన్ కార్డు రైతులు పండించిన ధాన్యాన్ని ఎక్కడైనా అమ్ముకునే విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడం వంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల్ని కాకుండా నిరుద్యోగులను విద్యార్థులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న అవినీతి, అరాచక, మాఫియా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భారత్ కుమార్ యాదవ్ గుర్తు కమలం గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ప్రజలే తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.