సురక్షితంగా ఓటుహక్కు వినియోగించుకోండి.
మీ రక్షణ మా బాధ్యత ..
సురక్షితంగా ఓటుహక్కు వినియోగించుకోండి..
సంరక్షణగా మీ వెంట మేముంటాం..
పల్లెల్లో బెటాలియన్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన ఎస్ ఐ, వెంకటరమణ,ఏ ఎస్సై శ్రీనివాసులు రెడ్డి
నెల్లూరు, ఆత్మకూరు, మర్రిపాడు, జూన్18, (సీమకిరణం న్యూస్):
ఆత్మకూరు నియోజకవర్గంలో జూన్ 23వతేది జరిగే ఉప ఎన్నికలకు మర్రిపాడు మండల గ్రామాల ప్రజలు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి భయానికి ప్రజలు గురికాకుండా తమ రక్షణ సామర్ధ్యాన్ని పల్లె ప్రజలకు గడప ముంగిట సర్కిల్ రక్షణ స్థానిక ఎస్ఐ వెంకటరమణ మరియు ఏ ఎస్సై శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నాడు సమస్యాత్మక,సాధారణ గ్రామాలు పొంగూరు, కేతి గుoట , పల్లిపాడు, గ్రామంలో బెటాలియన్ కవాతు నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక ఎస్సై వెంకటరమణ మాట్లాడుతూ ఆత్మకూరు ఉప ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా పోలీసులకు సహకరించాలని ఆయన తెలియజేశారు. గ్రామాలలోని ప్రజలు ఓటర్లు వారి యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా వేసుకోవాలని కోరారు. ఓటర్లను ఎవరైనా ప్రలోభాలకు గురి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ వెంకటరమణ స్థానిక ఏ ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి కేతి గుంట సర్పంచ్ హరితేజ స్థానిక పోలీసు సిబ్బంది బెటాలియన్ బృందం తదితరులు పాల్గొన్నారు.