ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

స్వయం ఉపాది చేపట్టి మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి

స్వయం ఉపాది చేపట్టి మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలి

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికా రాము

మచిలీపట్నం, జూన్ 20, (సీమకిరణం న్యూస్):

తక్కువ కాల వ్యవధిలో స్వయం ఉపాది చేపట్టి ఆర్ధికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ ,స్వచ్చంద సంస్థల సహకారంతో ఆసక్తి కలిగిన యువతులకు, మహిళలకు డిమాండు కలిగిన చేతి వృత్తులందు శిక్షణలు ఇవ్వనున్నట్లు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికా రాము అన్నారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చాంబర్ లో జరిగిన గ్రామీణ మహిళకు వివిధ చేతి వృత్తులందు శిక్షణకు సంబంధించి పలువురు అధికారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, వివిధ సంస్థల రిసోర్స్ పర్సన్ లతో సమీక్షా సమావేశం నిర్వహించబడింది.
ఈ సందర్భంగా జడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ, ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా మహిళాసాధికారికతకు లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి మహిళా పక్షపాతిగా మన దేశంలోనే ఈ ప్రభుత్వం పేరు తెచ్చుకున్నదన్నారు. రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మలు జీవితాల్లో ఆర్ధిక, సామజిక, రాజకీయ చైతన్యనినికి అన్ని విధాలా ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పుట్టిన బిడ్డ మొదలుకుని అలసి సొలసి పనిచేయలేని ముసలి వాళ్ళ వరకూ ప్రతి ఒక్కరి అవసరాలను ప్రభుత్వం గుర్తించి అందుకు అనుగుణంగా ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి దక్కుతుందన్నారు.
ప్రభుత్వ , స్వచ్ఛంద సంస్థల ద్వారా” వివిధ చేతి వృత్తులందు శిక్షణలు కల్పించాలన్నారు. మహిళల తమకు తాముగా ఆర్ధిక స్థితిగతులను అభివృద్ధి పరుచుకోగలమన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగించి గ్రామీణ. ప్రాంతాలలోని మహిళలను, యువతులను గుర్తించి చేతివృత్తుల౦దు శిక్షణలు పొందేలా కృష్ణాజిల్లా పరిషత్ ప్రోత్సహించనుందన్నారు.
వచ్చేనెల ( జులై ) 15 వ తది నుంచి మార్చి నెల వరకు 8 మాసాల వ్యవధిలో పలు మండలాల్లో టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సు, మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగుల తయారీ, శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. నిరుద్యోగం రూపుమాపడానికి, మహిళా సాధికారిత సాధించడానికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు. చాలా అంశాలలో శిక్షణలు కల్పించడం జరుగుతుందని, శిక్షణ అనంతరం సర్టిఫికెట్లను, సబ్సిడీ సైతం అందచేస్తామని జడ్పి చైర్ పర్సన్ అన్నారు. జిల్లాలోని మహిళలందరకు శిక్షణల వివరాలను తెలియచేసి కుంటుంబ శ్రేయస్సు కోసం పరితపించే మహిళలు ఆర్ధికాభివృద్ధి సాధించేందుకు ప్రోత్సహిద్దామని ఆమె అన్నారు. మహిళలు శిక్షణలు పొందిన చేతివృత్తులకు సంబంధించిన యూనిట్స్ , కుట్టు మిషన్లు తదితం యంత్ర పరికరాలు బ్యాంక్ ల ద్వారా రుణ సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తామన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యులైన మహిళలకు లింకేటి ఋణాలను అందించడానికి కృషి చేస్తామన్నారు. శిక్షణలు పొందిన మహిళలు వారు ఉత్పత్తి చేయు ప్రొడక్ట్స్ కు మార్కెటింగ్ విషయమై సహకారమందించి ప్రణాళికాబద్ధమైన సమిష్టి కృషి చేసి, మహిళలను ఆర్ధికంగా శక్తిమంతులను చేయడానికి కృష్ణాజిల్లా పరిషత్ సంసిద్ధంగా ఉందని చైర్ పర్సన్ ఉప్పాల హారికా రాము పేర్కొన్నారు. ఈ సమావేశంలో జడ్పి సిఇఓ సూర్య ప్రకాష్, డిప్యూటీ సిఇఓ జి. శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పధక సంచాలకులు ఎన్. వెంకట్రావు, ఐ సి డి ఎస్ పి డి సువర్ణ, జడ్పి సూపరెండెంట్ దారపు శ్రీనివాసరావు ( దాశ్రీ ), డాక్టర్ పట్టాబి మెమోరియల్ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్, జన శిక్షణ సంస్థాన్ ( విజయవాడ ) ఛైర్మెన్ పూర్ణిమ, అభయ ఎడ్యుకేషన్ సొసైటీ ( విజయవాడ ) డైరెక్టర్ జానకి, శ్రీ సీతారామ గార్మెంట్స్ ( గుడివాడ ) తరుపున చాముండేశ్వరి, శ్రీ సూర్య ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ( మచిలీపట్నం )సూర్యకుమారి, ఎవేక్ ఆర్గనైజేషన్( మచిలీపట్నం ) ఎన్. నాగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!