జర్నలిస్టుల హెల్త్ కార్డులు జులై వరకూ పొడిగింపు
కొత్తవారికి హెల్త్ కార్డులు ఇస్తాం
ప్రమాద బీమానూ పునరుద్దరిస్తాం
అక్రిడిటేష్ న్ కార్డుల సమస్యలూ పరిష్కారానికి కృషి
ఏ పి జె ఎఫ్ విజ్ఞప్తి పై ఐ అండ్ పి ఆర్ కమిషనర్ సానుకూల స్పందన
విజయవాడ, జూన్ 20, (సీమకిరణం న్యూస్) :
జర్నలిస్టుల హెల్త్ కార్డులను జులై వరకు పొడిగింపు చేశామని ఐ ఆండ్ పీఆర్ కమిషనర్ విజయ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అక్రిడిటేష్ న్ కార్డుల సమస్యల పరిష్కరిస్తామని హామీ ఇచ్ఛారు. ప్రమాద బీమాను పునరుద్ధరికరిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో విలేకరుల సమస్యలూ పరిష్కారం కోసం సహకారాన్ని అందించాలని ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు నేతృత్వంలో ఐ అండ్ పి ఆర్ కమిషనర్ విజయ కుమార్ రెడ్డిని సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం నుంచి జర్నలిస్టు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ కార్యక్రమాలు
నేడు కొన్ని జర్నలిస్టులకు అందుబాటులో లేవు. వాటిని పునరుద్ధరింపజేసి, జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక భరోసా
కల్పించవలసిందిగా కోరుతున్నామని ఏపీజేఎఫ్ నాయకులు విజయ కుమార్ రెడ్డి కి ఇచ్చిన వినతిపత్రం లో పేర్కొన్నారు. కొన్న సమస్యలు ఆయన ముందుంచారు.
గత రెండు సంవత్సరాలలో కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకు ప్రభుత్వం హామి ఇచ్చిన జీవో ప్రకారం 5 లక్షల రూపాయలను ఆయా
కుటుంబాలకు అందజేసి, ఆదుకోవాలని కోరారు.. జర్నలిస్టుల వెల్ఫెర్ ఫండ్ కు రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు కేటాయించాలన్నారు. జర్నలిస్టుల వెల్ఫేర్ కమిటిని పునరుద్ధరించి
జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. 20 సంవత్సరాలకు పైగా సీనియారిటీ ఉన్న జర్నలిస్టులకు నెలకు 10 వేల రూపాలయ చొప్పున పెన్షన్
స్కీమ్ ను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల 10 లక్షల రూపాయల ప్రమాద బీమాను పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నామన్నారు.
గడువు అయిపోయిన జర్నలిస్టుల హెల్త్ కార్డులకు ‘మీ సహకారంతో’ జూలై వరకు పొడిగింపు లభించినా.. కొత్త వారు కూడా అప్లైయ్
చేసుకోవడానికి అనుగుణంగా జర్నలిస్టు హెల్త్ కార్డు జీవోను ఇప్పించవలసిందిగా కోరుతున్నామని తమ వినతిపత్రం లో తెలిపారు.జిల్లాల విభజన వల్ల కొత్త జిల్లాలో అక్రిడిటేషన్ మంజూరు పరంగా వస్తున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ఆయా జిల్లాల్లో తక్షణం
మీడియా అక్రిడిటేషన్ కమిటీను ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నామన్నారు.
రాష్ట్రంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించే దిశగా సహకరించవలసిందిగా, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లవలసిందిగా కోరుతున్నాం.
సమాజ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర వహిస్తున్న పాత్రికేయ మిత్రుల కనీస సమస్యల పరిష్కారానికి మీ వంతు, సహకారం అందించాలని , ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. విజయ కుమార్ రెడ్డి ని కలిసిన వారిలో ఏపీజేఎఫ్ రాష్ట్ర నాయకులు వీర్ల శ్రీరామ్ యాదవ్ , అన్నవరపు బ్రహ్మయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎపిజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ఎపిజెఎఫ్ వెంకటరమణ, నగర అధ్యక్షులు, విజయవాడ తాళ్లూరి అనిల్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శి, విజయవాడ తదితరులు ఉన్నారు.