కోనసీమ జిల్లాకు బదిలీపై వెళ్తున్న జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారికి ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం.
జిల్లా ఎస్పీ గారి తండ్రి గారిని, జిల్లా ఎస్పీ దంపతులకు పూలమొక్కలు అందించి శాలువ తో సన్మానించిన అధికారులు
- కర్నూలు క్రైమ్, జూన్ 20, (సీమకిరణం న్యూస్):
కోనసీమ జిల్లాకు బదిలీపై వెళ్తున్న జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారికి ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పరేడ్ మైదానంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరై మాట్లాడారు. జిల్లా జడ్జి డాక్టర్ వి.రాధాకృష్ణ కృపా సాగర్ మాట్లాడుతూ
శాంతిభధ్రతల పరిరక్షణ, విధి నిర్వహణలో చిరునవ్వుతో బాగా పని చేశారన్నారు.
కర్నూలు రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మంచి నాయకత్వ లక్షణాలతో జిల్లాలో బాగా పని చేశారన్నారు. కోనసీమ జిల్లాలో కూడా చాలెంజింగ్ గా పని చేయాలన్నారు.
జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర్ రావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ మాటలు తక్కువగా మాట్లాడి ఎక్కువగా పని చేశారన్నారు. 11 నెలల పాటు జిల్లాను ప్రశాంతంగా నడిపించారన్నారు. 50 శాతం ఎస్పీ పడిన కష్టమేనన్నారు. పోలీసు, రెవెన్యూ, న్యాయ శాఖలు కలిసి సమన్వయంతో బాగా పని చేశాయన్నారు. జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ మాట్లాడుతూ 5 వ జిల్లా ఎస్పీ గా ఈ జిల్లాలో పని చేశానన్నారు. వ్యవస్ధలో హిరో అనేది ఉండరన్నారు. మనం చేసే పని విధానంలో ఉంటుందన్నారు. పోలీసు అధికారి పేరు చేబితే చిరునవ్వు, గుండెల్లో గర్వం రావాలన్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మన పని మనం చేస్తేచాలన్నారు. జిల్లాలో 11 నెలల పాటు శాంతిభద్రతల పరిరక్షణలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలన్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, పోలీసు అధికారులు బాగా పని చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారి తండ్రి ఈశ్వర్ రెడ్డి, జిల్లా ఎస్పీ గారి సతీమణి శ్రీమతి ప్రశాంతి సుధీర్ , మునిసిపల్ కమిషనర్ భార్గవ్ తేజ్ , శిక్షణ ఐపియస్ అధికారి ధీరజ్ కునుబిల్లి , అడిషనల్ ఎస్పీలు డి. ప్రసాద్, నాగబాబు, రాజేంధ్ర , డిఎస్పీలు వెంకటాద్రి, వెంకట్రామయ్య, మహేశ్వర్ రెడ్డి, వినోద్ కుమార్, కెవి మహేష్, శ్రీనివాసులు, శ్రీనివాస రెడ్డి, శృతి, రామాంజినాయక్, రవీంద్రా రెడ్డి, ఇలియాజ్ భాషా డిపివో ఏఒ సురేష్ బాబు, సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.