ANDHRABREAKING NEWSCRIMESTATE
జులై 1న గోర్ బంజారా జాతీయ సమ్మేళనం జయప్రదం చేయండి
ఎల్ హెచ్ పిఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కైలాస్ నాయక్
తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలి
మా తండాల్లో మా రాజ్యం రావాలి
జులై 1న ఛలో మహబూబాబాద్
జులై 1న గోర్ బంజారా జాతీయ సమ్మేళనం జయప్రదం చేయండి
లంబాడీ హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కైలాస్ నాయక్
కలెక్టరేట్లోని డిపిఆర్ఓ ఆవరణలో ఉన్న మీడియా పాయింట్ వద్ద వివిధ ప్రజాసంఘాల సినియర్ నాయకుల సమక్షంలో కర పత్రాల ఆవిష్కరణ
కర్నూలు కలెక్టరేట్, జూన్ 22, (సీమకిరణం న్యూస్) :
తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని మా తండాల్లో మా రాజ్యం రావాలని అలాగే రాజ్యాధికారంలో మా వాట మాకు దక్కాలన్న నినాదాలతో 1997 జూలై 1న లంబాడీ హక్కుల పోరాట సమితి ఆవిర్భవించిందని లంబాడీ హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కైలాస్ నాయక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని డిపిఆర్ఓ ఆవరణలో ఉన్న మీడియా పాయింట్ వద్ద లంబాడీ హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కైలాస్ నాయక్ ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల సీనియర్ నాయకులతో కలిసి లంబాడీ హక్కుల పోరాట సమితి కర పత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కైలాస్ నాయక్ మాట్లాడుతూ లంబాడి జాతిని జాగృతం చేసే వారిలో చైతన్యం నింపి హక్కుల కోసం ఉద్యమించే స్ఫూర్తిని కల్పించిన లంబాడీ హక్కుల పోరాట సమితి 25వ వార్షికోత్సవం పూర్తి చేసుకుని 26 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. ఎల్ హెచ్ పి ఎస్ మొదటి అడుగు హాస్టల్ లో నుంచి మొదలైందని గిరిజన హాస్టల్ లో లంబాడి విద్యార్థులు పశువుల కంటే హీనమైన స్థితిలో రోజులు వేళ్ళ వేయడాన్ని సహించలేకపోయిన కొంతమంది విద్యార్థులు పోరుబాట కు శ్రీకారం చుట్టనున్నారు విద్యార్థి ఉద్యమ మే జాతిని మేల్కొలిపి కుల సంఘం ఏర్పాటుకు దారులు వేసిందన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని మా తండాలో మా రాజ్యం రావాలని రాజ్యాధికారంలో మా వాట మాకు దక్కాలన్న నినాదాలతో స్పష్టమైన లక్ష్యాలతో విద్యార్థి ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన బెల్లయ్య నాయక్ తేజావత్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ దిల్ సూక్ నగర్ ప్రభూత్వ గిరిజన వసతి గృహం నందు1997 జూలై 1న ఎల్ హెచ్ పి ఎస్ ఆవిర్భవించిందన్నారు. లంబాడీ హక్కుల పోరాట సమితి 25వ వార్షికోత్సవం పూర్తి చేసుకుని 26 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నట్లు సందర్భంగా జులై 1న గోర్ బంజార జాతీయ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అలాగే జూలై 2న ప్రతినిధుల సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంబేద్కర్ గారు గిరిజన ప్రజల అభివృద్ధికై రాజ్యాంగం లో కల్పించిన హక్కుల సాధనకై ఏర్పాటు చేసుకున్న ఎకైక పోరాట సంఘమే లంబాడి హక్కుల పోరాట సమితి అని అన్నారు. చదువుకున్న యువకులతొ ఏర్పాటు చేసుకున్న సంఘమే లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్ హెచ్ పి ఎస్) అని నాటి నుండి నేటి వరకు అలుపెరుగకుండా పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా కేవలం జాతి ప్రయోజనాలకై పోరాటం చేస్తున్నసంఘం పోరాట లక్ష్యం 500 జనాభా కలిగిన తండాలను గూడాలను చెంచు పెంటలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ సాధన కై చైతన్య సభలు బహిరంగ సభలు పాదయాత్రలు సైకిల్ యాత్రలు ధర్నాలు రాస్తారోకోలు గిరిజన ప్రాంతాల్లో ఉన్న తండాలను తిరిగి గిరిజన లంబాడీల ప్రజలను చైతన్య పరుస్తూ డిమాండ్ సాధించుకున్న సంఘమే లంబాడి హక్కుల పోరాట సమితి అని గుర్తుచేశారు అలాగే ఈ పోరాట ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో 3175 ప్రత్యేక గ్రామ పంచాయతీలను సాధించుకుని అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభాను బట్టి దాదాపుగా 200 పై చిలుకు తండాలను గ్రామ పంచాయతీలు ప్రభుత్వాలను మెప్పించి చేసుకోవడం జరిగింది ఇంకా కొన్ని పంచాయతీలను చేయించు కోవలసిన అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉందని పంచాయతీలు జరగడం వల్ల దాదాపుగా గిరిజన లంబాడీలు నాలుగువేల దాకా సర్పంచులు చేసుకోగలి గా మన్నారు అలాగే 30 వేల దాకా వార్డు మెంబర్ లను చేసుకో గలిగి ఇదే రాజకీయ చైతన్యంతో ఎంపీటీసీ జడ్పిటిసి అయితే నేమి ఇలా రాజకీయ పదవులను సాధించగలిగాం ఉన్నారు . అలాగే పోరాటాలతో ఎక్కడ కూడా మా జాతికి అన్యాయం జరగకుండా మాకు రావలసిన హక్కులు ఏవైతే ఉన్నాయి దాని ద్వారా వచ్చే ఫలాలను కూడా లంబాడి హక్కుల పోరాట సమితి ద్వారానే సాధించుకుంటున్నాం.ఈ సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి అనే సంస్థను ఏర్పాటు జరిగి జూలై ఒకటో తేదీ నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26 వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా జాతీయస్థాయిలో లంబాడి హక్కుల పోరాట సమితి సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి సంఘ పెద్దలు నిర్ణయం తీసుకోవడం జరిగిందని . అందులో భాగంగానే జూలై ఒకటో తారీఖున తెలంగాణలోని ఖమ్మం జిల్లా మహబూబాబాద్ (మానుకోట)నందు ఆవిర్భావ సభ సిల్వర్ జూబ్లీ 25సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ స్థాయిలో గోర్ బంజారా లంబాడి సుగాలి నాయకులను సభకు పిలవడం జరుగుతుందని ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఇప్పుడు ఏర్పడిన కొత్త జిల్లాల అన్నిటిలో దాదాపుగా మా లంబాడి సుగాలి లు అనబడే ప్రజలు కూడా హాజరు పెద్ద ఎత్తున కావాలని పిలుపునిస్తూ ఈరోజు కర పత్రాన్ని విడుదల చేయడం జరిగిందని . అలాగే మరికొన్ని డిమాండ్లతో సంఘము ముందుకెళ్తుందని డిమాండ్ లో భాగంగా భారతదేశం మొత్తం మీద అన్నిప్రాంతంలలొ ఒక్కొక్కరాష్ట్రంలో ఒక పేరుతో పిలువబడే బంజారా జాతి. గోర్ బంజారా జాతిఅని మా భాష లో మేము పిలుచుకునే జాతి తెగ పేరు (గోర్) బంజారా అనబడే మేము దాదాపుగా 2011 సెన్సెస్ ప్రకారం భారతదేశంలో 12 కోట్ల పైబడి ఉన్న ఈ జనాభా ఇప్పటికీ దాదాపు 15 కోట్ల వరకు ఉంటుందని అంచనా మరి భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక బంజారా జాతి వారు మాట్లాడే బంజారా భాష రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని ఒక డిమాండ్ తొ రాబోయే కాలంలో జాతిని ఐక్యమత్యం చేస్తూ ప్రాంతాలకు రాష్ట్రాలకుఅతీతంగా ఒక డిమాండుతో ముందుకు తీసుకెళ్తామని ఈ డిమాండ్ల సాధన కు ప్రతి ఒక్క సుగాలి బిడ్డలు సహకరించాలని కోరుతున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం సినియర్ నాయకులు నక్కలమిట్ట శ్రినివాసుల,.శేషఫణి, పట్నాంరాజే శ్వరి, ముస్లిం మైనారిటీ నాయకులు ఇనాయుతుల్లా, ఖాదిర్ భాషా, యంజే బాబురాజు ,వాడాల త్యాగరాజు, అన్వర్ హుసేన్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫెడరేషన్ ఉద్యోగ సంఘం నాయకులు అర్జున్ నాయక్, కాళేనాయక్ ,దుర్గా వర ప్రసాద్ నేనావత్ రాము నాయక్, బాలు నాయక్, శంకర్ నాయక్, యం అర్ పి యస్ ధరూర్ గోపి గిరిజన విద్యార్థి చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు