కర్నూలు రేంజ్ డిఐజి ని కలిసిన కర్నూలు జిల్లా నూతన ఎస్పీ సిధ్ధార్థ్ కౌశల్
కర్నూలు క్రైమ్, జూన్ 23, (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సిధ్ధార్థ్ కౌశల్ ఐపియస్ బాధ్యతల స్వీకరణ అనంతరం గురువారం కర్నూలు రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ గారిని కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.