కార్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కలెక్టరేట్ లో ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు
కర్నూలు కలెక్టరేట్, జూన్ 24, (సీమకిరణం న్యూస్):
ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని సెరికల్చర్, హార్టికల్చర్, ఐసిడిఎస్, ట్రెజరీ, డిఆర్ డిఎ కార్యాలయాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.
కార్యాలయ పరిసరాల్లో భోజనం చేసిన ప్లేట్లు, గ్లాసులు పడేసి చెత్తా చెదారం తో అపరిశుభ్రంగా ఉండటంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. కార్యాలయ పరిసరాలు ఆహ్లాదంగా ఉంటే పని చేయడానికి ఉత్సాహం వస్తుందన్నారు.. సందర్శకులకు అధికారుల పట్ల గౌరవం పెరుగుతుందన్నారు.. ఇలా అపరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనారోగ్యం కలుగుతుందన్నారు..ఐసిడిఎస్ కార్యాలయం శుభ్రంగా ఉందని కలెక్టర్ ప్రశంసించారు..మిగిలిన కార్యాలయాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.. కలెక్టర్ వెంట సిపీఓ అప్పలకొండ, ఐసిడిఎస్ పిడి కేఎల్ఆర్కె కుమారి తదితరులు పాల్గొన్నారు.