జర్నలిస్టులకు వృత్తి పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలి
ఏపీడబ్ల్యుజెఎఫ్ డిమాండ్.
కర్నూలు టౌన్, జూన్ 24, (సీమకిరణం న్యూస్):
వృత్తి పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నేతలు డిమాండ్ చేశారు . శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ను ఎపిడబ్ల్యుజెఎఫ్ ప్రతినిధి బృందం కలిసి వినతిపత్రం సమర్పించింది . ఈ బృందంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి మదిలేటి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రామాంజనేయులు నగర ప్రధాన కార్యదర్శి కె నాగేంద్ర జిల్లా కమిటీ సభ్యులు పి యుసుఫ్ ఖాన్, చంద్రమోహన్ ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ వినయ్ కుమార్లు ఉన్నారు. జర్నలిస్టులతో పాటు వివిధ వృత్తుల్లో ఉండేవారి పై పెనుభారం మోపే ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.ఇప్పటికే రకరకాల పన్నుల పేరుతో ప్రజలపై పెనుభారం మోపిన ప్రభుత్వం జర్నలిస్టులకు కూడా వదిలిపెట్టకుండా వృత్తి పన్ను పేరిట చెల్లించాలని కోరుతూ నోటీసులు జారీ చేసిందన్నారు. రాజంపేటలో జర్నలిస్టులు పన్నులు చెల్లించాలని కోరుతూ ఈ నోటీసులు జారీ అయ్యాయన్నారు.. నిజానికి వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఆయా కంపెనీల లో వృత్తిపన్ను వసూలు చేస్తున్నారన్నారు. . గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువత అనేక మంది విలేకరుల గా అతి తక్కువ ఆదాయానికి పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదిన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచన చేసి జర్నలిస్టుల పై విధించిన వృత్తిపన్ను ఎత్తివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎపిడబ్ల్యుజెఎఫ్ నగర నాయకులు ,విజయ్, శివ,మధు , శేఖర్,పరమేష్ , మల్లికార్జున,మధు,, తదితరులు పాల్గొన్నారు