
జిల్లా జడ్జి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ సిధ్ధార్థ్ కౌశల్
కర్నూలు క్రైమ్, జూన్ 24, (సీమకిరణం న్యూస్):
కర్నూలు జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సిధ్ధార్థ్ కౌశల్ ఐపియస్ జిల్లా జడ్జి డాక్టర్ వి.రాధాకృష్ణ కృపా సాగర్ ని శుక్రవారం కర్నూలు జిల్లా కోర్టు లోని జడ్జి గారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
న్యాయశాఖకు, పోలీసుశాఖకు ఉన్న సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగు పడేలా చేస్తూ నేరం చేసిన వారికి త్వరితగతిన శిక్ష పడేలా పూర్తి సహాయసహకారాలు కావాలని, బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం అందించేలా పోలీసు శాఖ తరపున కృషి చేస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు.