జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ సిధ్ధార్థ్ కౌశల్
కర్నూలు క్రైమ్, జూన్ 24, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సిధ్ధార్థ్ కౌశల్ ఐపియస్ జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు ని శుక్రవారం కలెక్టర్ గారి క్యాంపు ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగస్వాములుగా కలిసి కృషి చేయాలని, అందుకు కావలసిన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రజలకు పూర్తి స్థాయి న్యాయం కోసం పోలీసు శాఖ తరపున కృషి చేస్తామని కలెక్టర్ గారికి తెలిపారు.