
దుల్హన్ పథకానికి దూరం చేసిన వైకాపా
– లక్ష ఇస్తానన్నాడు.. చివరికి చేతులెత్తేశాడు
– టిడిపితోనే మైనార్టీలకు సంక్షేమ పథకాలు సాధ్యం
పట్టణ తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు. కేఎండి ఫరూక్
ఎమ్మిగనూరు టౌన్, జూన్ 23, (సీమకిరణం న్యూస్) :
ఎన్నికల ముందు ముస్లింల కు ఇచ్చిన హామీలు ఇస్లామిక్ బ్యాంకు వైఎస్సార్ దుల్హన్ పథకం 50 వేల నుండి లక్ష రూపాయల ఇస్తానన్న హామీలు నవరత్నాలు పేరుతో ఇస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నయవంచనకు పాలడుతున్నారని పట్టణ తెలుగుదేశం పార్టీ మైనార్టీ అధ్యక్షులు కేఎండి ఫరూక్ పేర్కొన్నారు. గురువారం ఈ మేరకు అయన ఓ ప్రకటన లో తెలియచేస్తూ నిరుపేదల పెళ్లికి అంతో ఇంతో ఇచ్చి ఆదుకుంటాం.. పెళ్లి ఖర్చుకు కష్టమవుతున్న ముస్లిం మైనార్టీ వర్గాల్లోని నిరుపేద యువతులకు దుల్హన్ పథకం కింద ఆదుకుంటామన్న ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి సంబందించి ఇంతవరకు నిధులు ఇవ్వలేదు. దీంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడంలేదు.. రోజురోజుకు పెళ్లి చేసుకున్న యువతుల పేర్ల సంఖ్య నమోదు పెరిగిపోతున్నా.. వారికి అందించాల్సిన కానుక విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులతో ఈ పథకం అమలు చేయలేకపోయినట్లు హైకోర్టు కు నివేదికలో పేర్కొంది. పేద ముస్లిం మైనార్టీ యువతులకు పెళ్లి సందర్భంగా ఈ పథకం ద్వారా గత టిడిపి ప్రభుత్వం రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించేది. ఈ పథకాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు కాగా హైకోర్టు విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ మేరకు వివరణ ఇవ్వడం చాలా సిగ్గు చేటు అన్నారు. సుమారు కొన్ని నెలలుగా పేద ముస్లిం మైనార్టీ కొత్త జంటలకు నిరీక్షణ తప్ప…నిధులు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అది చేస్తున్నాం.. ..ఇది చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ముస్లిం మైనార్టీలకు సంబంధించి దుల్హన్ పథకం ద్వారా రూ. 50 వేలు అందించే దీనిని చంద్రన్న పెళ్లికానుకలో విలీనం చేశారు. ఇకనుంచి ముస్లిం మైనార్టీలు కూడా ఆన్‌లైన్ ద్వారానే దరఖాస్తు చేయాల్సి ఉంటుందని చెప్పి ఆన్‌లైన్ నందు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేద ముస్లిం మైనార్టీ యువతులు దరఖాస్తులు చేసుకున్నా చివరికి వారిని నిరాశే మిగిలింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బి.వి జయనాగేశ్వర రెడ్డి చేతుల మీదుగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో 496 మందికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున మొత్తం 24,800,000 రూపాయలు అందించారు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ది… కానీ వైసీపీ మాత్రం దుల్హన్ పథకం కింద లక్ష రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ముస్లీం, మైనారిటీల ఓట్లు వేయించుకుని తీరా అధికారంలోకి వచ్చాక వైయస్ జగన్ సర్కార్ చేతులెత్తేసింది. దీంతో రాబోయే ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు వైకాపా ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు.