బాదుడే బాదుడుతో అవస్థలు
–: మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ
ఆస్పరి : వైసీపీ పాలనలో సామాన్య మధ్యతరగతి ప్రజలపై మోపుతున్న అధిక ధరలు, పన్నులతో అవస్థలు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఆరోపించారు.
గురువారం మండలపరిధిలోని జొహారాపురం,ఆస్పరి గ్రామాల్లో సాయంత్రం బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం ప్రజలపై మోపు తున్న భారాలపై వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.
అనంతరం కోట్ల సుజాతమ్మ మాట్లాడుతూ ప్రజలకు సం క్షేమం అందిస్తామని చెబుతూ, రకరకాల పన్నులు వేసి వారిని అడ్డంగా దోచుకుంటూ జగన్ రాక్షస పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని మితిమీరిన అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుస్తున్నారంటూ విమర్శిం చారు. కష్టాలు వచ్చినా పార్టీని వీడకుండా వెన్నెంటే ఉంటున్న కార్యకర్తలే టీడీపీకి బలమ న్నారు.2024 ఎన్నికల్లో నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పరమారెడ్డి, మండల కార్యదర్శి శేషాద్రినాయుడు, సింగిల్ విండో మాజీ చైర్మన్ నౌనేపటి చౌదరి, మాజీ డైరెక్టర్ కృష్ణ, మాజీ మండల కన్వీనర్లు వెంకటేష్, శ్రీనివాసులుగౌడ్, తిమ్మన్న, మాజీ మార్కెట్ యార్డు మాజీ వైస్ చైర్మన్ సాలి సాహెబ్, ఉచ్చిరప్ప యాదవ్, సర్పంచ్ అంజినయ్య, మా నంది, ముత్యాలరెడ్డి, ఎంపిటిసి లు నరసన్న, రహింతుల్లా తదితరులు పాల్గొన్నారు.