సమస్యకు శాస్వత పరిష్కార మేదీ
చాగలమర్రి :
మండల పరిధిలోని జ్ఞానాపురం గ్రామాని చెందిన చెన్నయ్య కుమారుడు బాబురావు (19) కర్నూలులో ఆత్మహత్య చేసు కుని మృతి చెందారు. అయితే స్వగ్రామమైన అంత్యక్రియల నిమిత్తం జ్ఞాపాపురం తీసు కొచ్చారు. దళితుల అంత్య క్రియలు చేసే పొలం కొంత కాలంగా వివాదస్పదంగా మారింది. అయితే ఆస్థలంలో పూడ్చేందుకు వీలులేదంటూ నారాయణపల్లెకి చెందిన ఓ వ్యక్తి అడ్డుపడటంతో వివాదం ఏర్పడింది. విషయం తెలుసు కున్న ఎస్సై రమణయ్య , ఇన్ చార్జ్ తహసిల్దార్ శివశంకర్ రె డ్డిలు ఘటనాస్థలానికి చేరుకొని
ఇరువురికి సర్దిచెప్పారు. ప్రస్తుతం గతంలో దళితులు ఎక్కడ పూడ్చేవారో అక్కడే పూడ్చుకునేలా సామరస్యం చేశారు. కాగా జ్ఞానాపురంలో ఎప్పుడు ఎవరు మృతి చెంది నా వారి అంత్యక్రియల సమ యంలో ఇలా వివాదం మొదల వూతూనే ఉందని, తమకు శాస్వత పరిష్కారం చూపరా అని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత మంది అధి కారులు , ప్రభుత్వాలు మారినా తమకు తాత్కాలికంగా మాటల తో మబ్యపెట్టడమే తప్పా శాస్వత పరిష్కారం చూపడం లేదని దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు ఎప్పుడు పరిష్కారం అవుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.