ఆలయ మాన్యభూములు సాగుదారుల అరెస్ట్
-: మద్దతు తెలిపిన సిపిఎం నాయకులు అరెస్ట్
-: 31 మందిపై బైండోవర్ కేసు నమోదు
నంద్యాల (రుద్రవరం) :
ఆలయ మాన్యభూములు సాగుదారులతో పాటు మద్దతు తెలిపిన సిపిఎం నంద్యాలజిల్లా కార్యదర్శి టీ ,రమేష్ కుమార్, నాయకులు టి. రామచంద్రుడు, శంకర్, సుదర్శన్ లను పోలీసు లు అరెస్ట్ చేసిన ఘటన అళ్ల గడ్డ నియోకవర్గoలోని రుద్ర వరం మండలంలోని ఎల్లా వత్తుల గ్రామంలో గురువారం
చోటు చేసుకుంది.
ఎల్లా వత్తుల గ్రామంలో గత 25 ఏళ్లుగా బీడుగా ఉన్న 52 ఎకరాల ఆలయ భూములను చదును చేసుకుని 50 మంది నిరుపేదలు సాగు చేసుకుంటు న్నారు. ఈ ఏడాది దేవాదాయ శాఖ అధికారులు దేవాలయ భూములను బహిరంగ వేలం నిర్వహించి ధనవంతులకు కట్టబెట్టారు. ఆ భూములను 25 ఏళ్లుగా సాగు చేసుకుంటు న్న నిరుపేదలకు ఇవ్వాలని అనేకమార్లు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారమే చెల్లించి భూములను సాగు చేసుకుంటామని ప్రభుత్వ అధికారులను నిరుపేదలు కోరారు. నిరుపేదల విన్నపాన్ని పట్టించుకోకుండా దేవాదాయ శాఖ అధికారులు వేలంపాట నిర్వహించి భూములను కౌలు కు ఇచ్చారు. దీంతో దాదాపు 40 మంది నిరుపేదలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేవాలయ భూముల లో సాగు చేసు కుంటుoడగా సిరివెళ్ల సర్కిల్ ఇన్ స్పేక్టర్ చంద్రబాబు నాయుడు, రుద్రవరం, గోస్పా డు, ఆళ్లగడ్డ రూరల్, కోవెల కుంట్ల ఎస్ఐలు సిబ్బందితో కలిసి దేవాదాయ శాఖ అధి కారులు కౌలు ఇచ్చిన భూమి ఎలా సాగు చేసుకుంటారని వారిని భూముల నుంచి బల వంతంగా అరెస్టు చేసి లారీలో రుద్రవరం పోలీస్ స్టేషన్కు తరలించారు.
—-
31 మందిపై బైండోవర్ కేసు నమోదు
—-
ఎల్లా వత్తుల గ్రామానికి చెందిన 31 మందిపై కేసు నమోదు చేసి నట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలి పారు. ఎల్లా వత్తులలోని దేవా లయ భూములు వేలంపాటలో హక్కు ఉన్నటువంటి తుమ్మల ఈశ్వరయ్య సేద్యం చేస్తుండగా గ్రామానికి సంబంధించిన సుమారుగా 3 1 మంది తో పాటు సి.పి.ఎ నాయకులు పొలంలో ప్రవేశించి సేద్యం చేయకుండా అడ్డగించార న్నారు. దేవాలయ శాఖ ఈవో జనార్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేశామన్నా రు. తిరిగి ఇలా చేయ కుండా ఉండేందుకు 31మంది పై బైండోవర్ చేయించడం జరిగిందని ఎస్ఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.