ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి
-: లయన్ జోన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి
కర్నూలు టౌన్ :
పారిశ్రామిక రంగం దినదినాభి వృద్ధి చెందుతున్న తరుణంలో మంచి ఉద్యోగ అవకాశాలు పొందా లంటే ప్రతి ఒక్కరూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన కలిగి ఉండాలని లయన్ జోన్ చైర్మన్ ,యస్. వి సుబ్బారెడ్డి పౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, ఎస్. వి సుబ్బారెడ్డి ఫౌండేషన్, అసోసియేషన్ ఆఫ్ అలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ల సంయుక్త ఆధ్వర్యంలో వెంకట రమణ కాలనీలోని నైస్ కంప్యూటర్ కార్యాలయం లో సబ్ జూనియర్ ,జూనియర్, సీనియర్ విభా గాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పై క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి యువతీ యువకులు విద్యతో పాటు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొంది ఉండాలి అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.