గృహప్రవేశం లో చైర్ పర్సన్ సుప్రజా మురళి
బుచ్చిరెడ్డిపాళెం, జూన్24, (సీమకిరణం న్యూస్):
బుచ్చి నగరపంచాయితీ నాలుగో వార్డులోని అంబేద్కర్ నగర్ లో రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ & వైకాపా నాయకులు గంటా తిరుపాలు – చంద్రకళ నూతన గృహ ప్రవేశానికి బుచ్చి నగర చైర్ పర్సన్ మోర్ల సుప్రజ హాజరైయ్యారు. ఈసందర్భంగా చైర్ పర్సన్ మోర్ల సుప్రజను రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ దంపతులు పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి నూతన గృహంలోకి ఘనంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు విల్సన్, వైకాపా నాయకులు చెన్నయ్య,బాబు,ప్రవళిక,సురేష్,అనీల్, పాపయ్య,కిషోర్,జనార్ధన్ ,గంటా తిరుపాలు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.