క్షత్తగాత్రురాలకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం
దాతృత్వాన్ని చాటిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి
బుచ్చిరెడ్డిపాళెం, జూన్24, (సీమ కిరణం న్యూస్ )
ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం, ఉడ్ హౌస్ పేట తరుణవాయి పంచాయతీకి చెందిన డి రాజమ్మ నిన్న ఓటు వేసి తిరిగి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది.దింతో ఆమే కాలు నుజ్జునుజ్జు అయింది.దింతో వైద్యులు ఆమెకు ఒక కాలు తీసివేశారు. ప్రస్తుతం ఆమె నెల్లూరు లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయాన్ని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలుసుకుని ఆమెను పరామర్శించారు.అంతేకాక స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి చారిటబుల్ ట్రస్టు తరఫున రూ.1 లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించి మానవీయ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.మరియు అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కోవూరు నుంచి బుచ్చికి మోటార్ బైక్ పై వెళుతూ రోడ్డు ప్రమాదంలో గాయపడిన అడ్వకేట్ గూడూరు సుబ్బారెడ్డి ని మరియు వారితో కలిసి వారితో ప్రయాణం చేస్తూ గాయపడిన అడ్వకేట్ అశోక్ ని పరామర్శించారు.ఈ పరామర్శలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తో పాటు జిల్లా డిఏఏబి ఛైర్మన్ దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి , కోవూరు మండల ఏఏబి ఛైర్మన్ నిలపురెడ్డి హరిప్రసాద్ రెడ్డి వున్నారు.