
విజేత…విక్రమ్;
82,888 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన మేకపాటి విక్రమ్ రెడ్డి…..
నెల్లూరు, ఆత్మకూరు, మర్రిపాడు, జూన్ 26, (సీమకిరణం న్యూస్) :
దివంగత మంత్రి కీ.శే మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణానంతరం ఆత్మకూరులో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి బిజెపి అభ్యర్థి పై మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల మెజారిటీ తో విజయ దుందుభి మోగించారు.వైసీపీకి మొత్తం ఓట్లు 1,02,074 రాగా బీజేపీకి 19,332
బీఎస్పీకి 4897,నోటాకి 4179 ఓట్లు వేసిన ఓటర్లు ఇతరులకి 6599 ఓట్లు కట్టబెట్టారు లక్ష ఓట్ల మెజార్టీ అంటూ ప్రచారం చేసిన వైసీపీ నాయకులు 82,888 ఓట్ల భారీ మెజార్టీ రావడంతో ఓటింగ్ శాతం పెరిగి ఉంటే లక్ష వచ్చి ఉండేవని సమర్దించుకొని వైసీపీ నాయకులు నేతల సంబరాలు జరుపుకున్నారు మంత్రులు,ఎమ్మెల్యే ల శ్రమ ఫలించిందని సంబరపడ్డారు.వైసీపీ కి నియోజక వర్గంలోని ఆరు మండలాలలో సంగం 15,429 ,అనంతసాగరం14,094,మర్రిపాడు13,073,ఏ.ఎస్.పేట 10,415,చేజర్ల 10,294,ఆత్మకురు రూరల్ 10,285.ఆత్మకురు సిటీ 9,152.రావడంతో ఆత్మకురు నియోజకవరంలో వైసీపీ పార్టీ కి1,02,074 లక్ష రెండువేల డెబ్భై నాలుగు ఓట్లు పోలయ్యాయి.ఫలితాలు వెలువడిన వెంటనే మర్రిపాడు మండలంలోని గ్రామాలలో వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి ఆశయాలను ఎమ్మెల్యే గా గెలిచిన విక్రమ్ రెడ్డి ఆచరణ లో చూపిస్తూ మర్రిపాడు మెట్ట ప్రాంత ప్రజల సమస్యలు తీరుస్తారని అదే విధిగా సోమశిల హై లెవల్ కెనాల్ ఫేస్1,ఫేస్ 2 పనులు పూర్తి చేసి మెట్ట ప్రాంత పేదలకు సాగు ,త్రాగు నీరు అందించే విదంగా కృషి చేస్తారని మర్రిపాడు మండల ప్రజానికం ఆశిస్తున్నారు.