
ఆడబిడ్డకు ఆదరణ పేరుతో దుల్హన్ పథకం అందించిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.బివి జయ నాగేశ్వర్ రెడ్డి
పట్టణ టీడీపీ ముస్లిం మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో అందించిన నాయకులు !!
ఎమ్మిగనూరు టౌన్, జూన్ 26, (సీమకిరణం న్యూస్) :
ఎమ్మిగనూరు మాజీ శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.వి .బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఆర్థిక సహాయని నిరుపేద ముస్లిం కుటుంబం ఆడబిడ్డ వివాహానికి ఆదరణ దుల్హన్ తోఫా అందజేసిన పట్టణ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు కే యం డి. ఫరూక్, 6వ. వార్డు ఇన్చార్జి గంగన్న పట్టణ టీడీపీ ముస్లిం మైనార్టీ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో అందించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని 6వ వార్డు లో నివాసముంటున్న నిరుపేద ముస్లిం కుటుంబానికి రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు బి.వి .బివి జయ నాగేశ్వర్ రెడ్డి అందించిన ఆర్థిక సహాయాన్ని కీర్తిశేషులు ఉసేని,సతీమణి అయిన బడేబికి వారి, కూతురు వివాహానికి 6వ.వార్డు టిడిపి ఇన్చార్జ్ గంగన్న గారి సమక్షంలో పట్టణ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు కె యం డి. ఫరూక్, మైనార్టీ కమిటీ నాయకులు కలిసి నిరుపేద ముస్లిం కుటుంబ సభ్యుల వివాహానికి హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు బి వి .బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని పేద ముస్లిం ఆడబిడ్డ వివాహానికి ఆదరణ దుల్హన్, తోఫా అందించారు. ఈ సందర్భంగా పట్టణ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు కే యం డి ఫరూక్ మాట్లాడుతూ గత టిడిపి హాయంలో మాజీ శాసనసభ్యులు బి వి .బివి జయ నాగేశ్వర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన దుల్హన్, పథకం ద్వారా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలో సుమారు 500 మంది ముస్లిం కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు 50 వేల రూపాయల చొప్పున,2,48 లక్షల రూపాయలు అందజేశారు అన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుల్హన్ పథకం ద్వారా లక్ష రూపాయలు ఇస్తానని చెప్పిన సీఎం జగన్ మోహన్ రెడ్డి, పూర్తిగా మాట తప్పారని ఈమేరకు దుల్హన్ పథకం నిలిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. దీంతో పేద ముస్లిం ఆడబిడ్డల వివాహాలకు ఆయా నియోజకవర్గాలలో టిడిపి నాయకులు శక్తి కొలది ఆర్థిక సహాయాన్ని అందించాలని తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ బాబు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు, సూచించారని ఇందులో భాగంగా ఆడబిడ్డకు ఆదరణ పేరుతో దుల్హన్, తోఫా అందించడం జరిగిందని వైసీపీ ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్ లను టీడీపీ నాయకుల ప్రోత్సాహంతో నియోజకవర్గం పరిధిలోని ఆయా ప్రాంతాలలో త్వరలోనే అన్న క్యాంటీన్ లను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ నాయకులు రాజకీయాలు తో పాటు సామాజిక దృక్పథంతో ప్రజలు మన్ననలు పొందే విదంగా ప్రజా సేవలో కూడా భాగం పంచుకోవాలని ఈమేరకు పార్టీ అభ్యున్నతి జరుగుతుందని వారు స్పష్టం చేశారు.