రైతు భరోసా కేంద్రాలలోఎల్.ఆర్.జి.-52 కందులు పంపిణీ
రైతు భరోసా కేంద్రాలలో ఎల్.ఆర్.జి.- 52 కందులు(చిరుసంచులు) పంపిణీ
ఏ.ఓ. రామ్మోహన్.
ఆత్మకూరు, మర్రిపాడు , జులై 05, (సీమకిరణం న్యూస్) :
ప్రజల ఆకలిని తీర్చే రైతన్నల వ్యవసాయ పనులకు సహాయ సహకారాలు అందించేందుకు ప్రభు త్వం మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఖరీఫ్ సీజన్ మొదలుకాగానే రైతు భరోసా కేంద్రం నందు మండలంలో అర్హత కలిగిన ప్రతి గ్రామ రైతులకు ఎల్.ఆర్.జి – 52 కందులను(చిరుసంచులు) ఇచ్చే కార్యక్రమం చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా మర్రిపాడు మండల కేంద్రంలో స్థానిక వ్యవసాయాధికారి రామ్మోహన్ ఆధ్వర్యంలో అల్లంపాడు రైతు భరోసా కేంద్రం నందు గ్రామ వ్యవసాయ సహాయకుడు సి .హెచ్. పవన్ కళ్యాణ్ మరియు గ్రామ సర్పంచ్ అన్నవరపు కృష్ణారెడ్డి, అన్నవరపు నారాయణరెడ్డి, నరసింహారెడ్డి చేతులు మీదుగా గ్రామ రైతులకు కందులను ఇవ్వడం జరిగింది.మండల వ్యవసాయ అధికారి రామ్మోహన్ ఒక ప్రకటనలో తెలియజేస్తూ రైతు భరోసా కేంద్రంలో 100% సబ్సిడీతో కందులు ఎల్.ఆర్.జి. – 52 చిరు సంచులు విత్తనాలు మర్రిపాడు మండలంనకు155 క్వింటాళ్లు రావడం జరిగిందని ఈ కందులను వర్షాధార పంటగా కానీ వరి పైరు గట్లమీద వేసుకోవాలనిరైతులకుసూచించారు.మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు. మంగళవారం అల్లంపాడు గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకుడు సిహెచ్. పవన్ కళ్యాణ్ మరియు గ్రామ సర్పంచ్ అన్నవరపు కృష్ణారెడ్డి, అన్నవరపు నారాయణరెడ్డి, నరసింహారెడ్డి ,రైతులు తదితరులు పాల్గొన్నారు.