ఈ దారిలో… ప్రయాణం కష్టమే
-: దిక్కులు చూస్తే… అంతే సంగతులు
-: కోడుమూరు-ఎమ్మిగనూరు రహదారి తీరు వర్ణనాతీతం
కర్నూలు ప్రతినిధి, జూలై 05, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు నుండి కోడుమూరు, ఎమ్మిగనూరు మీదుగా వెళ్లే వాహనదారులు ఎవరైనా అదమరిచిన, దిక్కులు చూచిన రహదారిలో ఏర్పడ్డ గోతుల్లో పడటం ఖాయం… అది గమ నించని వెనుక వైపు వాహన దారులు అదే వేగంతో అను సరిస్తే అంతే సంగతులు అని పలువురు వాహనదారులు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే… కర్నూలు నుండి కోడుమూరు వరకు ప్రయాణం ఒకలా… అక్కడి నుండే అసలు తంతు మొదల వు తుంది మరీ! రహదారి పొడవునా ఎక్కడ చూసినా ప్యాకింగ్ వర్కులు జరిగి అవి కాస్త దెబ్బతినగా, అక్కడక్కడ భారీ స్థాయిలో నడిరోడ్డుపైనే గోతులు ఏర్ప డటం జరిగింది. వాటిని పూడ్చేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకున్న దాఖలాలు మచ్చుకు కూడా కనిపించడం లేదని ఆయా గ్రామాల ప్రజలతో పాటు వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇంత పెద్ద స్థాయిలో గోతులు ఏర్పడ్డ వాటి ని వాహనదారులు గమనించ కుండా ప్రయాణిస్తూ తరచూ ప్రమాదాల బారిన పడ్డ ఘట నలు కోకొల్లలు. ప్రయాణికులు, వాహనదారుల విలువైన ప్రాణా లు అనంత వాయువుల్లో కల వక ముందే స్పందించి గోతులు, పూడ్చివేసి రహదారిని బాగు చేయాలని కోరుతున్నారు. అధి కారులు, ప్రజాప్రతినిధులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిందే మరి..!