
బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఘనస్వాగతం
– నన్నుర్ టోల్ ప్లాజ్ నుంచి బైక్ ర్యాలీ
కర్నూలు టౌన్, జూలై 05, (సీమకిరణం న్యూస్) :
వైకాపా ఆంధ్రప్రదేశ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడుగా నియామకం అయిన అనంతరం తొలిసారిగా కర్నూలు నగరానికి వచ్చిన స్పోర్ట్స్ అథార్టీ రాష్ట్ర ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి అభిమానులు ఘనస్వాగతం పలికారు. సోమవారం సన్నూరు టోల్ ప్లాజాకు చేరుకున్న బైరెడ్డికి అభిమానులు పూలమాలలతో స్వాగతం పలికి బైక్ ర్యాలీని ప్రారంభించారు. బైక్ ర్యాలీ సీక్యాంపు సెంటర్ నుంచి గాయత్రి ఎస్టేట్ మీదుగా ఆర్.ఎస్.రోడ్ కూడలి, ఎస్వీకాంప్లెక్స్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఒపెస్టాప్ వాహనం లో అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాలీ కొనసాగింది. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి బైరెడ్డి మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన పదవిని వరంలా భావించి పార్టీకి అంకితభావంతో సేవచేస్తానన్నారు. రానున్న ఏ ఎన్నికైనా, అభ్యర్థి ఎవరైనా పార్టీ విజయానికి. శక్తివంచనలేకుండా కృషిచేస్తానన్నారు.