రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి
రేషన్ డీలర్లు నిరసన
ఎమ్మిగనూరు , జూలై 05 , ( సీమకిరణం న్యూస్ ) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తాసిల్దార్ కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అహ్మద్ మాట్లాడుతూ ప్రజా పంపిణీలో ప్రభుత్వం తీసుకున్న మార్పుల వల్ల రేషన్ డీలర్లకు ఆదాయ భద్రత గ్యారెంటీ లేకుండా పోయింది రాష్ట్ర ప్రభుత్వం డోర్ డెలివరీ పథకం తీసుకొచ్చి యం డి యూలకు జీతం హమాలి ఖర్చులు పెట్రోల్ ఖర్చులు ఇస్తున్నారు రేషన్ డీలర్లకు మాత్రం ఖర్చు లు ఇవ్వడం లేదు అని మన రాష్ట్రంతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాలలో రేషన్ డీలర్లకు ఒకే విధానమైన కమిషన్ ఉండాలని రాష్ట్రంలో రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లకు 440 రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఏపీలో కార్డు దారునికి రేషన్ డోర్ డెలివరీ డీలర్ అధాoటికేషన్ తో మాత్రమే జరిపించాలి యం ఎల్ యస్ పాయింట్ నుండి సంబంధిత డీలర్ల సంక్షేమ లో సరుకులు కోట వేసి ఇప్పించాలి యం ఎల్ యస్ పాయింట్ ఇన్చార్జి లకు ఆదేశాలు ఇవ్వాలి ఐ సి డి ఎస్ ఎం డి ఎం కమిషన్లు ఎ నెలకు ఆ నెల యాన్ సి ఎం లు వేయాలి ఆహార భద్రత చట్టప్రకారం ఎంఎల్ఎస్ పాయింట్ నుండి రేషన్ సరుకులును రేషన్ డిపో లో ఉచిత దిగుమతి చేయాలి 2019లో కమిషనర్ గారు సర్కులర్ ను అమలు చేయాలి పంచదార కందిపప్పు నూరు శాతం ఇవ్వాలి బస్తాలు పగిలిన పంచదార కందిపప్పు ప్యాకెట్లను వాపస్ తీసుకోవాలి రేషన్ డిపో లో ఉన్న ఎలక్ట్రానిక్ కాటా లను స్టాపింగ్ ఫీజు మినయించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండలప్రధాన కార్యదర్శి మదిలేటి మండల అధ్యక్షుడు వీరేష్ ప్రసాద్ పార్లపల్లి నారాయణ క్రాంతి మధు రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు