ANDHRA

– అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు.

అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు

రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 35వేలు ఉద్యోగాలు భర్తీ కోసం నూతన నోటిఫికేషన్లు విడుదల చేయాలి..

హోళగుంద, ఫిబ్రవరి11, (సీమకిరణం న్యూస్) :

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని 12వ తేదీన చలో విజయవాడ ధర్నాకు బయలుదేరుతున్న విద్యార్థి సంఘల నాయకులను ముందస్తుగా అరెస్టు చేసిన హోళగుంద పోలీసులు ఎఐఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీరంగ ఏస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు సతీష్ టిఎన్ఎస్ఎఫ్ మండల కార్యదర్శి మల్లికార్జున ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,35,794 ఉద్యోగాలను భర్తీ చేయాలని , ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని,రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులను, నిరుద్యోగులను ముందస్తు గా అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి శ్రీరంగ ఏస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు సతీష్ టిఎన్ఎస్ఎఫ్ మండల కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన నిరసన తెలియజేసే, సమ్మె చేసే హక్కులును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తుందని. వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న నిరసనలు పై కూడా అరెస్టు,నోటీసులు, కేసులు ,నిర్బంధలు ప్రయోగిస్తున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల లబ్ధి కోసం ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టీచర్ పోస్టుల భర్తీ చేస్తామాని, పోలీసులు వార్షికోత్సవ ఉత్సవాల్లో పోలీసు పోస్టులు భర్తీ చేస్తామని హామీలను గుర్తించి నిరుద్యోగుల ఓట్లను మలచుకుని గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకుండా, కేవలం సచివాలయ ఉద్యోగాల తోనే ప్రభుత్వ వ్యవహారాలన్నీ నడిపిస్తున్నాడు , మెగా డీఎస్సీ లేదు, పోలీస్ ఉద్యోగాలు లేవు, . ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 25 లక్షల పైబడి నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జనవరి లో కూడా నూతన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగిందని, కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ కూడా కేవలం ఒక్కసారి మాత్రమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అందులో డీఎస్సీ టీచర్ పోస్టులు పెట్టకపోవడం దారుణమని, ఉద్యోగాలు కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు ఆశలు, అడియాశలు అయ్యాయని. . అంతేకాకుండా ఉద్యోగస్తులకు మరో రెండేళ్లు వయోపరిమితి పెంచి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారనీ, కాబట్టి జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగుల వయో పరిమితిని పెంచాలని, ఉద్యోగస్తుల వయో పరిమితి తక్షణమే తగ్గించాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉద్రిక్తంగా మలిచి ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. హోళగుంద పోలీసులు ఛలో విజయవాడ కార్యక్రమనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు నాయకులు ను విడుదల చేయాలని అన్నారు ఈ అక్రమ అరెస్ట్ లో సిపిఎం నాయకుడు నాగరాజు ఉన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!