భద్రతా ఏర్పాట్లను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించిన కర్నూలు జిల్లా ఎస్పీ
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం
పోలీసు అధికారులకు, సిబ్బందికి , సహాకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాధాలు తెలిపిన జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్, జూలై 05, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా, ఆదోని పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ భద్రతా ఏర్పాట్లను దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు , బారికేడ్ల ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి గారి పర్యటన విజయవంతం కావడానికి సహకరించిన పోలీసు అధికారులు, పోలీసు సిబ్బందికి , అన్ని శాఖల అధికారులకు జిల్లా ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ రమణ, డిఎస్పీలు వినోద్ కుమార్, వెంకటాద్రి, వెంకట్రామయ్య, రామాంజి నాయక్ ఉన్నారు.