పార్ట్ టైం టీచర్లను రెగ్యులరైజ్ చేయాలి
– ముఖ్యమంత్రి సీఎం కు వినతిపత్రం అందజేత
ముఖ్యమంత్రికి వినతి పత్రం అందజేస్తున్న పార్ట్ టైం టీచర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజ రావు
ఎమ్మిగనూరు, జూలై 05, (సీమకిరణం న్యూస్) :
సర్వ శిక్ష అభియాన్ పార్ట్ టైం టీచర్లు గా పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని పార్ట్ టైం టీచర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి నాగరాజ రావు కోరారు. మంగళవారం ఆదోనిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆవరణంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. పార్ట్ టైం టీచర్ లు విద్యాభివృద్ధిలో ఎంతో పాత్ర ఉందని, 2012 సంవత్సరంలో సర్వ శిక్ష అభియాన్ ద్వారా నియామకం జరిగిందని, గతంలో స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి రెగ్యులరైజ్ చేశారని, తమను కూడా రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు విజయ్ కుమార్ పాల్గొన్నారు.