మా తల్లిదండ్రులపై భారం తగ్గించారు
కర్నూలు / ఆదోని , జూలై 05, (సీమకిరణం న్యూస్) :
జగనన్న విద్యాకానుక మూడో విడత పంపిణీ కార్యక్రమంలో ఆదోని బాలికలు మాధవి, సాయి చంద్రికలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు ఇంగ్లీషులో మాట్లాడి సభికులను అలరించారు.
మా తల్లిదండ్రులపై భారం తగ్గించారు : మాధవి, 10వ తరగతి, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్
విద్యా రంగంలో అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టి మా అభివృద్ధికి కృషి చేస్తున్న మీకు రాష్ట్ర విద్యార్థులందరి మీకు కృతజ్ఞతలు. ఒక పేద కుటుంబంలో పుట్టిన నేను ఈరోజు మీముందు ఇంత ధైర్యంగా ఇంగ్లీషులో మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం మీరే.
అమ్మఒడి ఇచ్చి మా తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఉచితంగా జగనన్న విద్యా దీవెన కిట్టు ఇచ్చి స్కూల్ యూనిఫామ్ దగ్గరనుంచి పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల వరకూ అన్నీ ఉచితంగా ఇచ్చి మా చదువు భారం మా తలిదండ్రులపై తగ్గించారు. గోరుముద్ద వల్ల మంచి పౌష్టికాహారం కూడా దక్కుతోంది. మన బడి నాడు-నేడు ద్వారా రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించారు. ఈరోజు మా స్కూల్లో రన్నింగ్ వాటర్ తో కూడిన టాయిలెట్ సౌకర్యం ఉంది. సానిటరీ నాప్కిన్స్ లేక ఇబ్బంది పడేవాళ్లం. ఇప్పుడు నాప్ కిన్స్ ఉచితంగా అందిస్తున్నారు. బైజూస్ లాంటి ఖరీదైన యాప్ మాకు ఉచితంగా అందిస్తున్నారు. దిశ యాప్ సహాయంతో ఈరోజు నేను అర్థరాత్రి ఒంటరిగా బయటికెళ్లగలుగుతున్నా. మీ పథకాలతో మా కలలను నెరవేర్చుకోగలననే నమ్మకం కలుగుతోంది.
ఒక అమ్మలాగా మా గురించి ఆలోచిస్తున్నారు.
మీరే మా రియల్ మామయ్య.
మీ గురించి నాలుగు నిమిషాల్లో చెప్పడం సాధ్యం కాదు.
మీరో అనంత పేజీల పుస్తకం.
…………….
సాయి చంద్రిక, నెహ్రూ మెమెరియల్ మునిసిపల్ స్కూల్, ఆదోని
మీ ముందు నిలబడి మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రజా సంకల్ప యాత్రలో విద్యార్థులకు నేను ఉన్నాను, నేను విన్నాను అని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన విధంగా ఉచిత ఇంగ్లీష్ విద్య అందిస్తున్నారు. తల్లిదండ్రులకు పిల్లలను బడికి పంపినందుకు అమ్మ ఒడి ద్వారా ఆర్థిక సహాయం చేస్తున్నారు. గోరు ముద్ద ద్వారా అందిస్తున్న భోజనం అద్భుతం..పేద పిల్లలకు మీరే ఒక వరం. మీ నవ్వు చాలా అందంగా ఉంటుంది. జగనన్న ఉండాలి, జగనన్న మొహంపై చిరునవ్వు కూడా ఉండాలి