ఆదోని పట్టణంలో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొనుటకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉదయం 9:43 గం.లకు ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. మంగళవారం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు, డిఐజి సెంథిల్ కుమార్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యేశిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య. తదితరులు పుష్ పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం 9:57 గం.లకు హెలికాప్టర్ ద్వారా ఆదోని పట్టణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్ళినారు. ఆదోని పట్టణంలో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని 2.15 గంటలకు తాడేపల్లి కి బయలుదేరారు