ఆదోనిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం….
కర్నూలు / ఆదోని , జూలై 05, (సీమకిరణం న్యూస్) :
ఆదోని నెహ్రు మెమోరియల్ మున్సిపల్ పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమానికి ఓర్వకల్లు విమానాశ్రయం నుండి ఆదోని ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉ.10:28 గంటలకు చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు ఉన్నారు. ఘన స్వాగతం పలికిన కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, ఎమ్మెల్సీ మరియు ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, కర్నూలు నగర పాలక సంస్థ కమీషనర్ భార్గవ్ తేజ, ఎస్.వి.మోహన్ రెడ్డి, శ్రీమతి బుట్టా రేణుక, పుష్ప గుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు
సమావేశం అనంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వీడ్కోలు :-
ఆదోని పర్యటనను విజయవంతంగా ముగించుకుని మధ్యాహ్నం 01:37 గంటలకు ఆదోని ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ నుంచి ఓర్వకల్లు విమానాశ్రయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు బయలుదేరారు.కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, శ్రీమతి బుట్ట రేణుకా తదితరులు ముఖ్యమంత్రి కి వీడ్కోలు పలికారు