ప్రతి ఒక్కరూ హిందీభాష పై పట్టు సాధించాలి
హిందీ ఉపాధ్యాయులు నూర్ అహ్మద్ భాష
ఘనంగా హిందీ భాషా దినోత్సవ వేడుకలు
ప్రతి ఒక్కరూ హిందీభాష పై పట్టు సాధించాలి
-: హిందీ దినోత్సవ వేడుకలో వక్తల హితబోధ
కర్నూలు ప్రతినిధి, సెప్టెంబరు 14, (సీమకిరణం న్యూస్) :
విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ హిందీభాష పై పట్టు సాధించడం ద్వారా మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్న వారవుతారని
చిన్న మల్కాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం రామ నరసప్ప విద్యార్థులకు హిత బోధ చేశారు. బుధవారం హిందీ భాషా దినోత్సవ వేడుకలు హిందీ ఉపాధ్యాయులు నూర్ అహ్మద్ భాష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో హిందీ ఉపాధ్యాయులు నూర్ అహ్మద్ భాష తో పాటు ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, గంగాధర్,వేణు గోపాల్,చంద్రశేఖర్ రెడ్డి, నందప్ప , నాగమణి, ఎస్తేరు ,షరీఫా ,శాంతమూర్తి ,షణ్ముగం తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎన్ రామ నరసప్ప హిందీ భాష యొక్క అవసరాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా హిందీ ఉపాధ్యాయులు ఎస్. నూర్ అహ్మద్ భాష మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రంతో పాటుగా అనేక జాతీయోధ్యమాలకు హిందీ బాసటగా నిలిచిందన్నారు. హిందీ జాతీయ భాషగా ప్రకటించిన నాటి నుంచి సెప్టెంబర్ 14వ తేదీని హిందీ దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. అనంతరం ఆయన హిందీ దినోత్సవo యొక్క ప్రాముఖ్యతను హిందీ భాష యొక్క గొప్పతనాన్ని వివరించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, గంగాధర్,వేణు గోపాల్,చంద్రశేఖర్ రెడ్డి, నందప్ప , నాగమణి, ఎస్తేరు ,షరీఫా ,శాంతమూర్తి , షణ్ముగం మాట్లాడుతూ భారత జాతియోధ్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి ఏకతాటిపై నడిపేందుకు ఉపయోగపడిన భాష హిందీ భాష అని అన్నారు. హిందీ భాషను నేర్చుకోవడం వల్ల కలిగే లాభాలను వారు విద్యార్థులకు వివరించారు. హిందీ భాష దినోత్సవాన్ని పురస్కరించుకొని వక్తృత్వ, వ్యాసరచన,చిత్రలేఖన ,పద్య ,పాటల పోటీలు నిర్వహించారు. అనంతరం పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. విద్యార్థులు హిందీకి సంబంధించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు.