ANDHRABREAKING NEWSPOLITICSSTATE
ప్రజలకు అందుబాటులో సచివాలయం నిర్మించాలి

ప్రజలకు అందుబాటులో సచివాలయం నిర్మించాలి
నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబర్ 12, ( సీమకిరణం న్యూస్ ) :
బుచ్చిరెడ్డి పాళెం నగరంలోని స్థానిక శాంతినగర్ లో సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులో నిర్మించాలని స్థానిక 9 వార్డు కౌన్సిలర్ యర్రటపల్లి శివకుమార్ రెడ్డి మీడియా సమక్షంలో ప్రజాప్రతినిధులు అధికారులను వేడుకున్నారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని హరివిల్లు లేఔట్ నందు నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.ఈ హరివిల్లు లేఔట్ శాంతి నగర్ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉందని తెలిపారు.వృద్దులు వికలాంగులు వితంతువులు, మహిళలు ఇబ్బందులు పడుతారని శాంతిని గురించి 08 ,09 వార్డు ప్రజలను దృష్టిలో ఉంచుకుని శాంతినగర్ లో ఉన్న ప్రభుత్వ ఖాలీ స్థలాల్లో నిర్మిస్తే ప్రజలకు సౌకర్యార్థంగా వుంటుందని విజ్ఞప్తి చేశారు.