మున్సిపల్ కార్మికుడి మృతి పట్ల చైర్ పర్సన్ సంతాపం
మున్సిపల్ కార్మికుడి మృతి పట్ల చైర్ పర్సన్ సంతాపం..
అన్ని విధాలా ఆదుకుంటామని హామీ..
నెల్లూరు,బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబర్ 12, ( సీమకిరణం న్యూస్ ) :
బుచ్చి నగరపంచాయితీ కార్మికుడిగా స్వీపర్ సీతయ్య ఆకస్మిక మరణం పట్ల చైర్ పర్సన్ మోర్ల సుప్రజ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మోర్ల సుప్రజమురళి మాట్లాడుతూ సీతయ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. .సీతయ్య పార్థివదేహానికి పూలమాల వేశారు. సీతయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అంత్యక్రియల నిమిత్తం రూ.15వేల రూపాయలు నిమిత్తం నగర పంచాయతీ నిధుల నుంచి వైస్ చైర్మన్ కోటంరెడ్డి లలిత రెడ్డి స్థానిక కౌన్సిలర్ మోర్ల జయంతి చేతుల మీదుగా వారి కుటుంబానికి అందజేశారు. మృతుడి కుటుంబానికి కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కార్మికులుకుటుంబాన్ని ఓదార్చి తమ సానుభూతి ప్రకటించారు.