
వరద బాధిత కుటుంబాలను పరామర్శించిన యం.యం.డి.ఇమామ్
అనంతపురం టౌన్, అక్టోబర్ 12, (సీమకిరణం న్యూస్):
అనంతపురం నగరంలో భారీ వరద నీటి ప్రవాహానికి పూర్తి జలదిగ్బంధంలో చిక్కుకున్న స్థానిక ప్రజలను బుధవారం ఉదయం నేరుగా ఇళ్ళ దగ్గరకు వెళ్ళి బాధితులను పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యం.యం.డి.ఇమామ్ పరామర్శించారు. భారీ వర్షం కారణంగా ప్రజలు ఒక వైపు కరెంట్ లేక చీకటి మయం, మరొక వైపు నివాసముంటున్న ఇళ్లలోకి ఒక్కసారిగా చేరిన వర్షపు నీటితో రాత్రంతా బిక్కు, బిక్కు మంటూ ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తు నిస్సహాయ స్థితిలో వున్న స్థానిక సోమనాథ నగర్ శాంతి నగర్, రంగ స్వామి నగర్, 5వ రోడ్డు నందు వున్న ప్రజలను పరామర్శించి వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదేవిధంగా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమై విధులు నిర్వహిస్తున్నారు. మీకు ఎలాంటి ఇబ్బందీ వున్నా స్థానిక వార్డు వాలంటరీ దృష్టికి తెలియజేయండి అంటూ దైర్యం చెప్పిన పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి యం.యం.డి.ఇమామ్. అనంతరం మిత్రులు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ అనంతపురం సిటీ చైర్మన్ బ్రహ్మ, యం.యం.డి.ఏ. సభ్యులు సూహైల్, భాష, జిలాన్, తదితరులు పాల్గొన్నారు.