
చెత్త నుండి సంపద తయారీని పరిశీలించిన అధికారులు
వెల్దుర్తి, అక్టోబర్ 12, (సీమకిరణం న్యూస్ ) :
సాలీడు వేస్టేజ్ చెత్త నుండి సంపద తయారిని మండల అధికారులు డిపిఓ నాగరాజు నాయుడు మండల అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని ఎల్ నగరం రత్నపల్లి గ్రామాలలో ఎస్ డబ్ల్యూ పిసి సెంటర్లను నిర్మాణం జరుగుతున్న ఆయా గ్రామాలలో పరిశీలించడం జరిగింది. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా డైరెక్ట్ ఎస్ డబ్ల్యూ పిసి సెంటర్లకే తీసుకురావాలని తెలిపారు. సిబ్బంది సమస్యలపై ఆరా తీశారు. ఎల్ నగరంలో చెత్త నిర్వహణ వర్మి కంపోస్టు తయారీపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆదర్శంగా నిర్మితమవుతున్న సచివాలయ నిర్మిత కేంద్రాలను చూసి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల భవన నిర్మిత కేంద్రాలను చూసి తొలితిగతన నిర్మించాలని అధికారులకు ఆదేశించారు. ఎల్ నగరం సచివాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యుడు కుమార్ రెడ్డి, ఈవో ఆర్ డి నరసింహులు, సెక్రెటరీ దేవమ్మ, ఓబ్లేసు, సచివాలయ ఆర్ బి కే ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.