చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి
చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి
అబ్దుల్ కలాం ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి
బాల్య వివాహాలను నిరోధించేందుకు 1098కు కాల్ చేయాలి
జడ్జి పఠాన్ షియాజ్ ఖాన్
వెల్దుర్తి, అక్టోబర్ 15, (సీమకిరణం న్యూస్):
చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని డోన్ కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పఠాన్
షియాజ్ ఖాన్ పేర్కోన్నారు. డోన్ మండల లీగల్ సర్వీస్ కమిటీ(ఎంఎల్ఎస్సి) ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలోని ఎంపియుపి ఉర్దు, జిల్లాపరిషత్ బాలుర, బాలికల, గురుకుల, కెజిబివి పాఠశాలలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జి పఠాన్ షియాజ్ ఖాన్ మాట్లాడుతూ బాల్యవివాహాల చట్టం, ఫోక్సో చట్టం, ర్యాగింగ్, ఉమెన్ హెల్ప్న్, చైల్డ్ హెల్ప్ లైన్, పోలీస్ హెల్ప్న్ తదితర చట్టాల గురించి క్షుణ్ణంగా
వివరించారు. చదువును మద్యలో ఆపేసి 18 ఏళ్లలోపు బాలికలకు వివాహం చేస్తుంటే ఆ బాల్య వివాహాలను నిరోధించేందుకు 1098కు కాల్ చేయాలని సూచించారు. చట్టాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరికి
భయపడాల్సిన అవసరం లేదన్నారు. మీకు అన్యాయం జరిగితే హెల్ప్న్ నెంబర్లకు ఫోన్ చేయాలని, మిమ్మల్ని
ఎవరైనా సరే దురుద్దేశ్యంతో తాకిన, మీ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధించిన అది నేరమే అవుతుందన్నారు. మీకు జరిగిన ఆ అన్యాయాన్ని పాఠశాల ఉపాధ్యాయులకు, స్నేహితులకు, తల్లితండ్రులకు, పోలీస్ కైనా
తప్పనిసరిగా చెప్పి న్యాయం కోరాలన్నారు. భారత మాజీ రాష్ట్రపతి ఏపిజె. అబ్దుల్ కలాం ఆశయాలను ఆదర్శంగా
తీసుకోవాలన్నారు. బాగా చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. సీనియర్ న్యాయవాదులు
నరసింహులు, గోపాల్ రెడ్డి సైతం చట్టాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే ఆయా
పాఠశాలల పరిసరాలను జడ్జి పరిశీలించారు. బాలికల
ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి
విద్యార్థినీలకు వడ్డించారు. కెజిబివిలో చట్టాలపై అవగాహన కల్పించి విద్యార్థినీలను ప్రశ్నించి వారితోనే జవాబులు
చెప్పించారు. క్రమశిక్షణగా ఉంటూ అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొవాలన్నారు. అనంతరం మహిళ, బాలికల చట్టాలకు
సంబంధించిన ఫ్లెక్సీలను జడ్జి పాఠశాలల హెచ్ఎంలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు
నరసింహులు, గోపాల్ రెడ్డి, జూనియర్ న్యాయవాది షేక్షావలి, పిఎల్పి షేక్. అమీర్, పాఠశాలల హెచ్ఎంలు
మెహరున్నిసా బేగం, జంబులన్న, విజయకుమారి, నిర్మల, షాకీరాబేగం, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.