
మత గురువు ఫయాజ్ ను కలిసిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, అక్టోబర్ 22, (సీమకిరణం న్యూస్) :
ఏ.యస్. పేట లోనీ శ్రీ హజరత్ ఖ్వాజా రహమతుల్లా నాయబ్ రసూల్, అమ్మజాన్ దర్గాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష దర్శించుకున్నారు. శ్రీ హజరత్ ఖ్వాజా రహమతుల్లా నాయబ్ రసూల్ స్వామి వారి 249వ గంధ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ఉర్దూ కవి సమ్మేళనమైన నాతియా ముషారియా కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష ఏఎస్ పేటకు చెందిన మత గురువు పఠాన్ ఫయాజ్ ఖాన్ ఇంటికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీ హజరత్ అమ్మజాన్ పున్య దంపతుల యొక్క విశీస్టతలను, వారి మహీమల గురించి పఠాన్ ఫయాజ్ ఖాన్ ఉప ముఖ్యమంత్రి కి వివరించారు. అనంతరం మత గురువు పఠాన్ ఫయాజ్ ఖాన్ మంత్రికి ప్రత్యేక దువా చేసి ఆశీర్వదించారు.