
ఆదోని డి.ఎస్.పి వినోద్ కుమార్ కు ఉత్తమ సేవా పురస్కారం
కర్నూలు క్రైమ్, నవంబర్ 01, (సీమకిరణం న్యూస్):
ఆదోని డి.ఎస్.పి వినోద్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవ పురస్కారం అవార్డుకు ఎంపిక చేసినట్లు రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర పోలీస్ శాఖ డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అవార్డును ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. ఆదోని డివిజన్లో అనేక ప్రాంతాల్లో పనిచేసిన డీఎస్పీ వినోద్ కుమార్ కు రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారం అవార్డు రావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆదోని పట్టణంలో ఎస్ఐ గాను, సిఐ గాను, డిఎస్పీగాను అనేక రకాలుగా సేవలు అందించారని ప్రజలు కొనియాడారు. విధి నిర్వహణలో ఆయనకు ఆయన సాటి అని తెలిపారు. ఆయనకు ఉత్తమ సేవ పురస్కారం రావడం హర్షించదగ్గ విషయమన్నారు.